E-Paper
Advertisement

Upcoming Camera Phones 2026: కెమెరా యుద్ధానికి సిద్ధమా.. 2026లో మార్కెట్‌ను శాసించబోయే బెస్ట్ ఫోన్లు ఇవే

Upcoming Camera Phones 2026: కెమెరా యుద్ధానికి సిద్ధమా.. 2026లో మార్కెట్‌ను శాసించబోయే బెస్ట్ ఫోన్లు ఇవే
Advertisement

Upcoming Camera Phones 2026: 2026లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తం కెమెరా మీదే ఫోకస్ పెట్టబోతోంది. పెద్ద సెన్సార్‌లు, పెరిస్కోప్ జూమ్, తక్కువ వెలుతురు ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్‌లో కొత్త టెక్నాలజీ ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ. కెమెరా లవర్స్‌కు 2026 ఒక బిగ్ ఇయర్ అని చెప్పాలి. ఇది 2026లో రానున్న ముఖ్యమైన కెమెరా ఫోన్లు వాటి పేర్లు, అంచనా ధరలతో వివరంగా చూద్దాం.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా – (Samsung Galaxy S26 Ultra) ధర 1,25,000 రూపాయలు

Advertisement

శామ్‌సంగ్ 2026 లో కూడా కెమెరా కింగ్‌గా నిలవాలని చూస్తోంది. గెలాక్సీ ఎస్ 26 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. కొత్త పెరిస్కోప్ లెన్స్ ద్వారా 10 ఎక్స్ ఆప్టికల్ జూమ్ మరింత క్లియర్‌గా కనిపించనుంది. నైట్ ఫోటోగ్రఫీలో ఏఐ ప్రాసెసింగ్ బాగా మెరుగవుతుంది. వీడియోలో 8 కే స్టెబిలైజేషన్ కూడా అప్‌డేట్ అవుతుంది. దీని ధర ఇండియాలో సుమారు 1,25,000 రూపాయలు ఉండొచ్చు.

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ – (iPhone 18 Pro Max) ధర 1,45,000 రూపాయలు

Advertisement

ఆపిల్ 2026 లో కెమెరా విషయంలో పెద్ద మార్పు చేయబోతోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో కొత్త పెరిస్కోప్ జూమ్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది. ఫోటో కలర్ టోన్ చాలా నేచురల్‌గా ఉండటం ఆపిల్ బలం. వీడియో రికార్డింగ్‌లో సినిమా లెవెల్ క్వాలిటీ ఇస్తుందని అంచనా. తక్కువ వెలుతురులో కూడా డీటెయిల్స్ తగ్గకుండా ఫోటోలు వచ్చేలా సెన్సార్ అప్‌డేట్ ఉంటుంది. దీని ధర భారత మార్కెట్‌తో పోల్చితే సుమారు 1,45,000 రూపాయలు ఉంటుందని అంచనా.

Also Read: History of Mobiles: అప్పుడు అరకేజీ బరువు.. ఇప్పుడు అన్నీ అందులోనే.. మొబైల్ ఫోన్ ఇంట్రెస్టింగ్ హిస్టరీ

షియోమీ 16 అల్ట్రా – (Xiaomi 16 Ultra) ధర రూ. 95,000

షియోమీ కెమెరా ఫోన్లలో ఎప్పటికప్పుడు షాక్ ఇస్తోంది. 2026 లో షియోమీ 16 అల్ట్రాలో 1 ఇంచ్ సైజ్ సెన్సార్ ఉండే అవకాశం ఉంది. లైకా ట్యూనింగ్‌తో ఫోటోలు చాలా షార్ప్‌గా కనిపిస్తాయి. జూమ్ కెమెరాలో 120 ఎక్స్ డిజిటల్ జూమ్ మెరుగైన క్వాలిటీతో వస్తుంది. కెమెరా లవర్స్‌కు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇండియా మార్కెట్‌లో దీని ధర 95,000 రూపాయలు ఉంటుంది.

వివో ఎక్స్ 300 ప్రో – (Vivo X300 Pro)ధర రూ. 85,000

వివో ఫోన్లు ముఖ్యంగా పోర్ట్రైట్ ఫోటోగ్రఫీకి ఫేమస్. ఎక్స్ 300 ప్రోలో కొత్త సోనీ సెన్సార్ వాడే అవకాశం ఉంది. స్కిన్ టోన్ చాలా నేచురల్‌గా క్యాప్చర్ అవుతుంది. వీడియోలో సినెమాటిక్ బ్లర్ ఎఫెక్ట్ మరింత రియలిస్టిక్‌గా ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా 4 కే వీడియోకు సపోర్ట్ ఇస్తుంది. ధర సుమారు 85,000 రూపాయలు ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 11 ప్రో – (Google Pixel 11 Pro) ధర 1,05,000 రూపాయలు

గూగుల్ పిక్సెల్ ఫోన్లు కెమెరా ప్రాసెసింగ్‌లో కింగ్. పిక్సెల్ 11 ప్రోలో హార్డ్‌వేర్ కన్నా సాఫ్ట్‌వేర్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఏఐ ఆధారంగా ఫోటోలు చాలా క్లియర్‌గా వస్తాయి. నైట్ ఫోటో మోడ్, మ్యాజిక్ ఎడిటింగ్ ఫీచర్లు ఇంకా అడ్వాన్స్ అవుతాయి. వీడియో స్టెబిలైజేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ధర సుమారు 1,05,000 రూపాయలు ఉండే అవకాశం ఉంది.

ఏది బెస్ట్ ఫోన్ అంటే?

2026 లో కెమెరా ఫోన్ల ఎంపిక చాలా కఠినంగా ఉండబోతోంది. ఎక్కువ జూమ్ కావాలంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా బెస్ట్. వీడియో క్వాలిటీకి ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ముందుంటుంది. ఫోటోగ్రఫీ ప్యాషన్ ఎక్కువ ఉన్నవారికి షియోమీ 16 అల్ట్రా మంచి డీల్. పోర్ట్రైట్ ప్రేమికులకు వివో ఎక్స్ 300 ప్రో సరైన ఎంపిక. సాఫ్ట్‌వేర్ కెమెరా మ్యాజిక్ కావాలంటే గూగుల్ పిక్సెల్ 11 ప్రో బెటర్. మీ అవసరాన్ని బట్టి ఈ కెమెరా ఫోన్లలో ఒకదాన్ని ఎంచుకుంటే 2026 లో ఫోటోగ్రఫీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే OPPO Enco Buds3 Pro..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న Thomson 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×