E-Paper
Advertisement

Discount on Vivo Y200 Pro: 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే‌తో వివో బడ్జెట్ ఫోన్ లాంచ్.. ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీగా డిస్కౌంట్

Discount on Vivo Y200 Pro: 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే‌తో వివో బడ్జెట్ ఫోన్ లాంచ్.. ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీగా డిస్కౌంట్
Advertisement

Huge Discount on Vivo Y200 Pro Mobile: స్మార్ట్‌ఫోన్ కంపెనీ Vivo దాని ఫేమస్ Y సిరీస్‌ ఫోన్లను విస్తరించే పనిలోపడింది. ఈ క్రమంలోనే Y సిరీస్ లైనప్‌లోని కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y200 Proను విడుదల చేసింది. దీని కోసం కంపెనీ చాలా కాలంగా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు ఈ మిడ్ రేంజ్ ఫోన్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. Vivo ఈ ఫోన్ చాలా స్టైలిష్, స్లిమ్‌గా ఉంటుంది. ఇది మొబైల్ ప్రియులను ఎట్రాక్ట్ చేస్తుంది. దీని ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి.

Vivo Y200 Pro 6.78-అంగుళాల 3D కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది పూర్తి HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 nits పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు 105 శాతం NSTC కలర్ గామట్‌ను అందిస్తుంది. అంటే ఈ ఫోన్‌లో మీరు గేమింగ్‌తో పాటు వీడియోలను కూడా హై క్వాలిటీలో చూడొచ్చు.

Advertisement

Vivo Y200 Pro స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 695 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 8GB RAM+128GB స్టోరేజ్ ఉంటుంది. ఇది 8GB వరకు వర్చువల్ RAMకి సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్ RAM సామర్థ్యాన్ని 16GBకి పెంచుతుంది. ఫోన్ 5,000mAh బ్యాటరీ ప్యాక్‌తో 44W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌‌తో వస్తుంది.

Also Read: వివో నుంచి రెండు స్టన్నింగ్ ఫోన్లు లాంచ్.. కేక పుట్టిస్తున్న ఫీచర్లు!

Advertisement

Vivo Y200 Pro కెమెరా గురించి మాట్లాడితే ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను పొందుతారు. ఇందులో OIS మద్దతుతో 64-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2-మెగాపిక్సెల్ బోకె సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

హ్యాండ్‌సెట్ Android 14 OS ఆధారిత Funtouch OS 14 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. ఈ విభాగంలో అత్యంత సన్నని ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. IP54 రేటింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Also Read: అతిపెద్ద కూలింగ్ సిస్టమ్‌తో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్.. రేపే లాంచ్!

Vivo Y200 Pro ఫోన్‌ను భారతదేశంలో ఒకే 8GB + 128GB వేరియంట్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 24,999. అంతేకాకుండా SBI క్రెడిట్/డెబిట్ కార్టులపై రూ.2500 డిస్కౌంట్ అందిస్తుంది. ఇది ప్రస్తుతం Vivo eStoreలో సేల్‌కు తీసుకొచ్చారు. కస్టమర్‌లు ఈ ఫోన్‌ని సిల్క్ గ్రీన్, సిల్క్ గ్లాస్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ కొత్త సిల్క్ గ్లాస్ డిజైన్‌తో కూడా వస్తుంది.

Tags

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×