E-Paper
Advertisement

Vivo X100 Pro 5G Discount Offer: గూబ గుయ్యిమనే ఆఫర్.. ఏకంగా రూ.55,900 భారీ డిస్కౌంట్.. కెమెరా ఫోన్‌లలో తోపు ఇదే..!

Vivo X100 Pro 5G Discount Offer: గూబ గుయ్యిమనే ఆఫర్.. ఏకంగా రూ.55,900 భారీ డిస్కౌంట్.. కెమెరా ఫోన్‌లలో తోపు ఇదే..!
Advertisement

Vivo X100 Pro 5G Discount Offer on Flipkart: చాలా మంది ఫోన్ ప్రియులు హెచ్‌డీ క్వాలిటీ ఫోటోలనిచ్చే స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటారు. కానీ అలాంటి క్వాలిటీ గల ఫొటోల ఫోన్‌ను కొనుక్కోవాలంటే అధిక మూల్యం చెల్లించాల్సిందే. దీని కారణంగానే ఫోన్ ప్రియులు తమ ప్లాన్‌ను మార్చుకుంటున్నారు. ఎప్పుడైనా మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉంటే అప్పుడు కొనుక్కోవచ్చులే అని అనుకుంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. తాజాగా టెక్ బ్రాండ్ వివో ప్రీమియం ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో Vivo X100 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 16GB RAM, 50MP కెమెరా, 5400mAh బ్యాటరీ, Android 14 కలిగిన ఈ Vivo X100 Pro 5G ఫోన్ భారీ తగ్గింపును పొందుతోంది.

ముందుగా Vivo X100 Pro 5G ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ Vivo ఫోన్‌లో 2800 x 1260 పిక్సెల్ రిజల్యూషన్, 95.53 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ Vivo ఫోన్‌లో ఒకే ఒక వేరియంట్ ఉంది. ఈ ఫోన్ 16GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. Vivo X100 Pro ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించబడింది. ఈ ఫోన్ OIS మద్దతుతో 50MP Sony IMX989 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు 50MP అల్ట్రా వైడ్ యాంగిల్, 50MP టెలిఫోటో లెన్స్ సెటప్ ఇందులో అందించబడింది.

Advertisement

Also Read: పొద్దు పొద్దునే 5జీ ఫోన్‌పై క్రేజీ ఆఫర్.. రూ.625లకే కొనేయొచ్చు.. పరుగులే పరుగులు..!

అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 32MP కెమెరా అందించబడింది. మెరుగైన ఫోటోగ్రఫీ కోసం ఇది పోర్ట్రెయిట్, అల్ట్రా HD డాక్యుమెంట్, స్లో మోషన్, లైవ్ ఫోటో, నైట్ మోడ్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంది. ఇక Vivo X100 Pro బ్యాటరీ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 5400mAh బ్యాటరీని కలిగి ఉంది. 100W ఫ్లాష్‌ఛార్జ్ అండ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ను అందించారు. ఇందులో MediaTek Dimensity 9300 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ రన్ అవుతుంది.

Advertisement

ఇక ఫైనల్‌గా Vivo X100 Pro 5G ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.96,999గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై 7 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ రూ.89,999లకే లిస్ట్ అయింది. దీనిపై భారీ బ్యాంక్ ఆఫర్ ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ట్రాన్షక్షన్‌పై దాదాపు రూ.7000 తగ్గింపు అందుబాటులో ఉంది. అప్పుడు ఈ ఫోన్‌ను రూ.82,999లకే కొనుక్కోవచ్చు. ఇవి కాకుండా ఈ ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంది. ఏకంగా రూ.55,900 భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే.. పాత ఫోన్ మంచి కండీషనలో ఉండాలి.

Tags

Related News

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

Big Stories

Advertisement
×