E-Paper
Advertisement

Washing Machine: వాషింగ్ మెషీన్‌ను పాడు చేసే ఈ 4 పొరపాట్లు మీరూ చేస్తున్నారా?

Washing Machine: వాషింగ్ మెషీన్‌ను పాడు చేసే ఈ 4 పొరపాట్లు మీరూ చేస్తున్నారా?
Advertisement

Washing Machine: ఈ రోజుల్లో వాషింగ్ మెషిన్ లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఇంట్లో అమ్మకు సాయంగా.. గంటల కొద్దీ పట్టే బట్టలు ఉతికే పనిని కొన్ని నిమిషాల్లోనే చేసేస్తుంది. అయితే, మెషిన్ మన పనిని తేలిక చేస్తుంది కదా అని మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చివరకు వేల రూపాయల రిపేర్లకు దారితీస్తాయి. అందుకే మీ వాషింగ్ మెషిన్ ఎక్కువ కాలం మన్నిక రావాలంటే ఈ తప్పులు చేయొద్దు.

బట్టల మోత మెషిన్‌కు భారమే:

చాలామంది పని త్వరగా అయిపోవాలనో, లేక నీళ్లు ఆదా అవుతాయని మెషిన్ నిండా బట్టలు కుక్కేస్తుంటారు. మెషిన్ కెపాసిటీకి మించి లోడ్ వేస్తే, లోపల డ్రమ్ తిరగడానికి చాలా కష్టపడుతుంది. దీనివల్ల మోటార్‌ మీద విపరీతమైన లోడ్ పడి అది కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. పైగా బట్టల్లో కూడా సరిగ్గా మురికి పోవు. అందుకే ఎప్పుడూ డ్రమ్‌లో కనీసం నాలుగో వంతు ఖాళీ ఉండేలా చూసుకోండి. అప్పుడే అది ఫ్రీగా తిరుగుతుంది.

Advertisement

Also Read: ఈ దుస్తులను పొరపాటున కూడా వాషింగ్ మెషీన్‌లో వేయకండి, ఎందుకంటే?

సర్ఫ్‌లు అస్సలు వాడొద్దు:

చేత్తో ఉతికే బట్టల కోసం వాడే సర్ఫ్‌ను మెషిన్‌లో అస్సలు వాడకూడదు. అది విపరీతమైన నురగను ఇస్తుంది. ఆ నురగ వల్ల మెషిన్ సెన్సార్లు, పైపులు పాడైపోతాయి. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ వాడేవారు దానికి తగ్గ లిక్విడ్స్ వాడితేనే మంచిది. ఇక బట్టలు బాగా మురికిగా ఉన్నాయని ఎక్కువ సర్ఫ్ వేయొద్దు. అలా చేస్తే ఆ పొడి మెషిన్ లోపల పేరుకుపోయి, బ్యాక్టీరియా చేరి కంపు కొడుతుంది.

జేబులు చెక్ చేయండి:

Advertisement

దుస్తులను వాషింగ్ మెషిన్‌లో వేసే ముందు ఒక్కసారి జేబుల్లో కాయిన్స్, పిన్నీసులు, తాళాలు ఏవైనా ఉన్నాయోమో చెక్ చేసుకోవాలి. ఇలాంటివి లోపలికి వెళ్తే డ్రమ్‌కు గీతలు పడతాయి. ఒక్కోసారి ఆ చిన్న వస్తువులు డ్రైనేజీ పైపుల్లో ఇరుక్కుపోయి నీళ్లు బయటకు వెళ్లకుండా ఆపేస్తాయి. మెషిన్ నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయంటే ఇలాంటివి లోపల ఇరుక్కున్నాయనే అర్థం. ఇది చివరకు పెద్ద రిపేర్‌కు దారితీస్తుంది.

మెషిన్ పరిశుభ్రతా ముఖ్యమే:

వంట అయ్యాక పొయ్యిని ఎలా తుడుచుకుంటామో.. మెషిన్‌ను కూడా అలాగే చూసుకోవాలి. దుస్తులను మెషిన్ నుంచి తీసిన వెంటనే మూత పెట్టేయొద్దు. అలా చేస్తే లోపల ఉన్న తేమ వల్ల బూజుతో పాటు వాసన కూడా వస్తుంది. బట్టలు వాషింగ్ అయ్యాక కనీసం ఓ అరగంట పాటు మూత తెరిచి ఉంచితే గాలి ఆడి లోపల ఆరిపోతుంది. అలాగే నెలకు ఒక్కసారైనా టబ్ క్లీన్ ఆప్షన్ వాడటం లేదా వెనిగర్‌తో క్లీన్ చేసుకోవడం చేస్తే మీ మెషిన్ ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది.

Also Read: మార్కెట్లోకి అదిరిపోయే పోర్టబుల్ ఏసీలు.. ఏ గదిలోకి కావాలంటే ఆ గదిలో పెట్టుకోవచ్చు!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×