E-Paper
Advertisement

అపరిచితులకు మీ ఫోన్ నెంబర్ కనిపించకూడదా? అయితే వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!

అపరిచితులకు మీ ఫోన్ నెంబర్ కనిపించకూడదా? అయితే వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్‌ మార్చుకోండి!
Advertisement

WhatsApp Update: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్.. ఇప్పుడు మన ప్రైవసీ కోసం ఒక సూపర్ ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఎవరికైనా మెసేజ్ చేయాలన్నా లేదంటే కొత్త వాళ్లతో చాట్ చేయాలన్నా మన ఫోన్ నెంబర్ కచ్చితంగా తెలిసి ఉండాలి. దీనివల్ల తెలియని వాళ్లకు కూడా మన నెంబర్ వెళ్లిపోయే అవకాశం ఉండేది. కానీ ఇకపై ఆ సమస్య ఉండదు. వాట్సాప్ త్వరలో username అనే ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీంతో టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నట్టే.. జస్ట్ మీ పేరుతోనే ఇతరులతో చాట్ చేయొచ్చు. ఈ ఫీచర్ వలన మీ పర్సనల్ నంబర్ అపరిచితులకు కనిపించదు.

పేరు సెట్ చేసుకోవడం ఎలా?

ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చాక.. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నచ్చిన పేరును సెట్ చేసుకోవచ్చు. అయితే దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. పేరు కనీసం 3 అక్షరాల నుండి గరిష్టంగా 35 అక్షరాల లోపు ఉండాలి. చిన్న అక్షరాలు (ఏబీసీడీలు), అంకెలు మాత్రమే వాడాలి. అంతేకాదు.. చూడటానికి వెబ్‌సైట్ అడ్రస్‌లా ఉండే పేర్లను వాట్సాప్ అస్సలు ఒప్పుకోదు. ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా ఉండేందుకే వాట్సాప్ ఈ కండిషన్ పెట్టింది.

Advertisement

Also Read: నథింగ్ నుంచి మరో సంచలనం.. మెటల్ బాడీ, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న CMF Phone 3 Pro!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్..

మీకు గనుక ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ లేదంటే ఫేస్‌బుక్‌లో ఒక పేరు ఉంటే.. అదే పేరును వాట్సాప్‌లో కూడా వాడుకోవచ్చు. మెటా అకౌంట్ సెంటర్ ద్వారా దీన్ని వెరిఫై చేస్తారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అన్ని చోట్లా ఒకే పేరు ఉంటే.. గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో కూడా ఈజీగా కనిపెట్టేస్తారు. అందుకే మీ ప్రైవసీని బట్టి పేరును జాగ్రత్తగా ఎంచుకోవడం మంచిది.

సెక్యూరిటీ కోసం పిన్ కోడ్..

Advertisement

యూజర్‌నేమ్ ఉంది కదా అని ఎవరు పడితే వాళ్లు మెసేజ్ చేస్తారని కంగారు పడక్కర్లేదు. దీనికోసం వాట్సాప్ యూజర్‌నేమ్ కీ అనే ఒక 4 అంకెల పిన్ కోడ్‌ను తీసుకొస్తోంది. ఎవరైనా కొత్త వ్యక్తి మీకు మెసేజ్ చేయాలంటే మీ పేరుతో పాటు మీరు సెట్ చేసిన ఆ పిన్ కూడా వాళ్లకు తెలిసి ఉండాలి. అప్పుడే వాళ్లు మీకు మెసేజ్ చేయగలరు. దీనివల్ల అనవసరమైన స్పామ్ మెసేజ్‌లకు చెక్ పెట్టొచ్చు. మీ చాటింగ్ ఎప్పటిలాగే ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంటుంది. వాట్సప్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్డేట్ మన ప్రైవసీకి ఇదొక పెద్ద భరోసా అని చెప్పొచ్చు.

Also Read: రూ.8 వేలకే హోమ్ థియేటర్ సెటప్.. 20W స్పీకర్లు, మైక్స్‌తో ROAR ప్రొజెక్టర్ వచ్చేసింది!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×