E-Paper
Advertisement

వై-ఫై గురించి ఈ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా?

వై-ఫై గురించి ఈ 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్  తెలుసా?
Advertisement

Wi-Fi Facts: కరెంట్, వాటర్ సప్లై లాగా ఇప్పుడు ఇంటర్నెట్ కూడా నిత్యావసరంగా మారిపోయింది. ఎక్కువ మంది మొబైల్ ఇంటర్నెట్ పై ఆధారపడుతున్నా.. వై-ఫై నెట్ వర్క్ కూడా క్రమంగా పెరుగుతోంది. కంప్యూటర్లు, టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు ఇలా లేటెస్ట్ గ్యాజ్డెట్స్ ను వై-ఫై నెట్ వర్క్ తో లింక్ చేసుకోవచ్చు. వై-ఫై నెట్ వర్క్ తో హై స్పీడ్ ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు. వై-ఫై గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

1. Wi-Fi అంటే..

Advertisement

Wi-Fi అనే పేరుకు నిజంగా ఎలాంటి మీనింగ్ లేదు. Wi-Fi అంటే వైర్‌లెస్-ఫిడిలిటీ అని జనరల్ గా చెబుతున్నప్పటికీ.. దీనిని ఏ రికార్డ్స్ రిజిస్టర్ చేయలేదు. IEEE 802.11b అనే వైర్‌లెస్ కనెక్టివిటీ జర్నీని సింప్లిఫై చేసి పెట్టుకున్న పేరే వై-ఫై. 1998 నాటి Wi-Fi అలయన్స్ నుంచి Wi-Fi అనే పేరు వాడుకలోకి వచ్చింది.

2. వై-ఫై ఎప్పుడు స్టార్ట్ చేశారు?

Advertisement

రేడియో కమ్యూనికేషన్, వైర్‌లెస్ కనెక్షన్ అనే ఐడియా 1971లో స్టార్ట్ అయింది. ఆ సంవత్సరంలోనే Wi-Fi స్టార్టింగ్ ప్రొడెక్ట్ ALOHA నెట్ ను కమర్షియల్ గా ఉపయోగించడం మొదలుపెట్టారు. గ్రేట్ హవాయి ఐలాండ్స్ లో దీనిని ఫస్ట్ యూజ్ చేశారు. ఆ తర్వాత ఈథర్‌నెట్ లేదా వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్‌లు, Wi-Fi వచ్చాయి.

3. వై-ఫై రూటర్ కు ఎన్ని డివైజ్ లు కనెక్ట్ చేయవచ్చు?

ఒక వై-ఫై రూటర్ కు 250 డివైజ్ ల వరకు సపోర్ట్ చేస్తాయి. బ్యాండ్‌ విడ్త్ షేరింగ్ రీజన్లతో ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది. కానీ రూటర్ ను కరెక్ట్ ప్లేస్ లో ఉంచితే మీ రూటర్ కు 250 డివైజ్ ల వరకు కనెక్ట్ చేసుకోవచ్చు.

4. వై-ఫై రూటర్ల కవరేజ్ జోన్‌

రూటర్లలోని ఇంటర్నెల్ యాంటెనా స్పియర్ షేప్ లో కవరేజీని అందిస్తుంది. ఎక్స్ టర్నల్ యాంటెనా డోనట్ షేప్ కవరేజీని అందిస్తుంది. మీ ఇంటి మొత్తం బెస్ట్ కవరేజీ వచ్చేందుకు వై-ఫై రూటర్ ను ఇంటి మధ్య భాగంలో ఉంచాలి.

5. వై-ఫై జనరేషన్స్

మీరు Wi-Fi రూటర్ ను సెలెక్ట్ చేసుకునే ముందు.. కొన్ని విషయాలు గుర్తొంచుకోవాలి. ప్రెజెంట్ 6th జనరేషన్ డివైజ్ లు అందుబాటులో ఉన్నాయి. D-Link వంటి ఫేమస్ రూటర్ బ్రాండ్‌లు హై స్పీడ్ కనెక్టివిటీ కోసం Wi-Fi 6 రూటర్లను తయారుచేస్తున్నాయి.

6. వై-ఫై నెట్‌వర్క్‌లు

ప్రభుత్వాలు సిటీలలో ఫ్రీ వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. వైర్‌లెస్ ఎక్స్‌టెండర్‌ల సాయంతో వై-ఫై నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నాయి.

7. వై-ఫై ఆరోగ్యానికి హానికరమా?

Wi-Fi రిలీజ్ చేసే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు. మీరు వై-ఫై యాంటెనాకు దగ్గరగా ఉంటే బ్రాడ్‌బ్యాండ్ సిగ్నల్ క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువగా ఉంటే, సిగ్నల్ వేవ్ లెంగ్త్ అంత తక్కువగా ఉంటుంది.

Also Read: WiFi Tips: రూటర్ బాగున్నప్పటికీ.. ఇంటర్నెట్ రావట్లేదా? అయితే ఈ తప్పులు చేస్తున్నట్లే!

Related News

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

Big Stories

Advertisement
×