E-Paper
Advertisement

Babar as a Drinks Boy: డ్రింక్స్‌ బాయ్‌గా బాబర్.. పాక్‌ కెప్టెన్‌కు ఘోర అవమానం..

Babar as a Drinks Boy: డ్రింక్స్‌ బాయ్‌గా బాబర్.. పాక్‌ కెప్టెన్‌కు ఘోర అవమానం..
Advertisement

Babar as a Drinks Boy: పాకిస్తాన్‌ క్రికెట్ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌కు ఘోర అవమానం జరిగింది. పాకిస్తాన్‌ ఆల్‌టైమ్‌ వన్డే టీమ్‌ను ప్రకటించిన క్రికెట్‌ ఐస్‌లాండ్‌… ఆ జాబితాలో బాబర్‌ను డ్రింక్స్‌ బాయ్స్‌ జాబితాలో చేర్చింది. అతనితో పాటు మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌లను కూడా క్రికెట్‌ ఐస్‌లాండ్‌ డ్రింక్స్‌ బాయ్స్‌ జాబితాలో చేర్చింది. దాంతో… గొప్ప ఆటగాళ్లుగా పేరుపొందిన ముగ్గురికీ ఇంతకంటే అవమానం ఏముందంటున్నారు… అభిమానులు.

పాకిస్తాన్‌ ఆల్‌టైమ్‌ వన్డే జట్టులో ఓపెనర్లుగా సయీద్‌ అన్వర్‌, జహీర్‌ అబ్బాస్‌లకు స్థానం కల్పించిన క్రికెట్‌ ఐస్‌లాండ్‌… ఆ తర్వాత ఇంజమామ్‌-ఉల్‌-హక్‌, జావేద్‌ మియాందాద్‌, మహ్మద్‌ యూసఫ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, షాహిద్‌ అఫ్రిది, మొయిన్‌ ఖాన్‌(వికెట్‌కీపర్‌), వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, సక్లయిన్‌ ముస్తాక్‌లకు చోటు కల్పించింది. కెప్టెన్‌గా పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విటర్‌ ద్వారా ప్రకటించింది… క్రికెట్‌ ఐస్‌లాండ్‌.

Advertisement

టీ-20 వరల్డ్‌కప్‌ ఫైనల్ సహా… సొంతగడ్డపై జరుగుతున్న అనేక సిరీస్‌ల్లో బాబర్‌ ఆజామ్‌ సారథ్యంలోని పాక్ క్రికెట్‌ టీమ్‌ వరుసగా ఓటములే ఎదుర్కొంటోంది. ఇంగ్లండ్‌ చేతిలో టెస్ట్‌ సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన బాబర్‌ సేన.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను అతికష్టం మీద 0-0తో డ్రా చేసుకుంది. రెండు టెస్టుల్లోనూ ఓటమి అంచుల దాకా వచ్చి… అదృష్టం కొద్దీ తప్పించుకుంది. సొంతగడ్డపైనే జట్టు దారుణంగా ఆడటంతో… పాక్ క్రికెట్ అభిమానులు బాబర్ ఆజామ్ సహా జట్టు ఆటగాళ్లందరిపైనా తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా బాబర్‌ కేవలం రికార్డుల కోసమే మ్యాచ్‌లు ఆడతాడని, జట్టు జయాపజాయాలతో సంబంధం లేనట్లు ఉంటాడని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్రికెట్‌ ఐస్‌లాండ్‌ బాబర్‌ను డ్రింక్స్‌ బాయ్‌గా పేర్కొనడం… అతనికి మరింత అవమానమే.

Tags

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×