CM Vijay – Trisha: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు జట్లు ఎలిమినేట్ కాగా… మరికొన్ని జట్లు ప్లే ఆఫ్స్ కోసం తలపడుతున్నాయి. ఇలాంటి క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants vs Chennai Super Kings) మధ్య మ్యాచ్ మొన్న జరిగిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay), హీరోయిన్ త్రిష (Trisha) జంటగా వచ్చినట్లు ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ లక్నోలోని ఏకనా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Ekana International Cricket Stadium) వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు నుంచి ప్రత్యేకంగా ఈ మ్యాచ్ కోసం సీఎం విజయ్, త్రిష వెళ్లారని మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారని వీడియోను వైరల్ చేస్తున్నారు. అయితే ఇది నిజమే అనుకోని చాలా మంది క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక, విజయ్ తెగించాడని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. త్వరలో వీళ్ళు పెళ్లిచేసుకున్న ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని మరి కొంత మంది అంటున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ నెల 15వ తేదీన మ్యాచ్ జరిగింది. అదికూడా లక్నోలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగితే ఈ ఇద్దరు జంటగా వెళ్లి ఎంజాయ్ చేశారంటే అందరూ నమ్మేవాళ్ళు. కానీ మ్యాచ్ జరిగింది లక్నోలో కాబట్టి ఈ ఇద్దరు మ్యాచ్ కు వెళ్లే ప్రసక్తే లేదని తెలుస్తోంది. కావాలనే కొందరు ఏఐ ద్వారా విజయ్, త్రిష్ మ్యాచ్ కు వెళ్లినట్లు క్రియేట్ చేసి, వైరల్ చేస్తున్నారు. నిజానికి కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ ఫుల్ బిజీగా మారిపోయారు. పాలన వ్యవస్థ పైన దృష్టి పెట్టారు.
ఓ ఏడాది కాలం తర్వాతేనే ఇలా మ్యాచులను తిలకించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ దాకా వెళ్తే, సీఎం విజయ్ మ్యాచ్ చూసేందుకు వెళ్లే చాన్సులు ఉండనున్నాయి. అంతేకానీ త్రిష తో జాలీగా గడిపే అంత సమయం, సందర్భం విజయ్ కి లేదు. ఇప్పటికే త్రిషతో రిలేషన్ లో విజయ్ ఉన్నాడని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఇలా బరితెగించి తిరిగితే.. విజయ్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇకపైన త్రిషతో విజయ్ దూరంగానే ఉంటూ.. తమిళనాడు ప్రజలకు మంచి పాలన అందించే దిశగా అడుగులు వేస్తారని చర్చ జరుగుతోంది.
अरे CM साहेबभी चेन्नई क फैन है…
अपनी प्रेमिका क साथ दिखे…. pic.twitter.com/4K7sFe0hdh
— Anshu yadav (@AnshuYadav34752) May 16, 2026