BigTV English

Kuldeep Yadav Opens On His Marriage: బౌలర్ కుల్‌దీప్ క్లారిటీ.. నటితో డేటింగ్‌.. ఆపై పెళ్లి గురించి..

Kuldeep Yadav Opens On His Marriage: బౌలర్ కుల్‌దీప్ క్లారిటీ.. నటితో డేటింగ్‌.. ఆపై పెళ్లి గురించి..

Kuldeep Yadav Opens On His Marriage(Today’s sports news): టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో టీమిండియా ఆటగాళ్లు ఉన్నారు. ముంబై నుంచి ఒకొక్కరు తమ తమ రాష్ట్రాలకు వెళ్తున్నారు. అక్కడ కూడా వాళ్లకి మాంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటి వారిలో టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఒకరు. ఇంతకీ స్పెషలేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.


టీమిండియా కీలకమైన ఆటగాళ్లలో ఒకడు కుల్‌దీప్ యాదవ్. ఆయన ఆట గురించి చెప్పనక్కర్లేదు. ముంబై నుంచి సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాడు. కాన్పూర్‌లో ఈ ఆటగాడికి ఘన స్వాగతం లభించింది. అభిమానులు భారీగా తరలివచ్చి టపాసులు, బ్యాండ్ హంగామాతో ఊరేగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. ఏ ఆటగాడైనా కోరుకునేది ఇదే.. దాని కోసం ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తారు.

కప్ గెలిచిన చాలామంది ఆటగాళ్లుకు మ్యారేజ్ కాలేదు. చాలామంది ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో పడ్డారు. అలాంటి వారిలో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఒకడు. ఆ మధ్య బాలీవుడ్‌కి చెందిన ఓ నటితో మనోడు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు టూర్లు, షికార్లు అంటూ ఓ రేంజ్‌లో టాక్ నడిచింది. ఆ విషయం ఎంతవరకు వచ్చిందో తెలీదుగానీ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించాడు.


Also read: బీసీసీఐ ఫ్రైజ్ మనీ.. 125 కోట్లు, నాలుగు కేటగిరీలకు..

తన లైఫ్ పార్టనర్ గురించి కీలక విషయాలు చెప్పాడు కుల్‌దీప్ యాదవ్. త్వరలో తాను మ్యారేజ్ చేసుకోనున్నట్లు మనసులోని మాట బయటపెట్టాడు. తాను పెళ్లి చేసుకోబోయేది ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదన్నాడు. తనను, తన ఫ్యామిలీని బాగా చూసుకుని, అర్థం చేసుకున్న అమ్మాయని వెల్లడించాడు. అలాంటి అమ్మాయి తన జీవితంలోకి రావడం చాలా ముఖ్యమన్నాడు. ఇంతకీ లైఫ్ పార్టనర్ ఎవరు? ఎక్కడ అనేది త్వరలో చెబుతానన్నాడు. కనీసం ఏమాత్రం క్లూ ఇవ్వలేదు కుల్‌దీప్.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×