BigTV English

Virat Kohli Spotted London: కోహ్లీ దొరికేశాడ్రోయ్.. నెట్టింట్లో పోస్టు వైరల్..!

Virat Kohli Spotted London: కోహ్లీ దొరికేశాడ్రోయ్.. నెట్టింట్లో పోస్టు వైరల్..!

Virat Kohli Spotted Roaming London: అరెరే… కొహ్లీ దొరికేశాడు రా…అంటూ నెట్టింట పోస్టులు, కామెంట్లు తెగ వైరల్ అయిపోతున్నాయి. సోషల్ మీడియా అంటే ఏమనుకున్నారు. సప్త సముద్రాలు దాటి మర్రిచెట్టు తొర్రలో దాక్కున్నా సరే, ఇట్టే పట్టేస్తారు. నెట్టింట్లో పెట్టేస్తారు. మమ్మల్ని వదిలేయండ్రా మొర్రో అన్నా వినిపించుకోరు. మీ చావు మీరు చావండి. మా ఏడుపు మేం ఏడుస్తామన్నా వినరు.


కొహ్లీ దాక్కునే వరకు పరిస్థితి తీసుకెళ్లారు. నేనిక్కడ ఉన్నానని చెప్పేసి ఉంటే, ఇంత గొడవ ఉండేది కాదుగా, అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరేమో మేమైనా పట్టుకు తినేస్తామా? అంటున్నారు. అంత సీక్రెట్ గా ఉండాల్సిన అవసరం ఏముంది? సెలబ్రిటీలు అయిన తర్వాత, ప్రైవసీ కోసం ఇలా పరుగులు పెట్టడం కరెక్టు కాదని కొందరు అంటున్నారు.

ఆటలో ఎటువంటి బౌలర్ కి భయపడని కొహ్లీ, సోషల్ మీడియాకి భయపడటం వింతగా ఉందని మరికొందరు వాక్యానిస్తున్నారు. సరే మొత్తానికి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నాడు అనే సస్పెన్స్కు తెరపడింది. ఫిబ్రవరి 15న రెండో సంతానం కలిగిందని, బాబు పేరు అకాయ్ అన్న విషయాన్ని తెలిపిన కాసేపటికే కోహ్లీ కెమెరాకు చిక్కాడు. విరాట్ ఫోటోను అతడి ఫ్యాన్స్ క్లబ్కు చెందిన ఒకరు తన అకౌంట్లో పోస్ట్ చేశాడు.


Read More: 6,6,6,6,6,6.. ఈ వంశీ కృష్ణ ఎవరు?

ఈ ఫొటోలో విరాట్ ఓ లాంగ్ వింటర్ కోట్, క్యాప్లో నడుచుకుంటూ ఏదో ఇంగ్లీషు పిక్చర్ లో హీరోలా వెళుతున్నట్లు కనిపించాడు. అనుష్క శర్మ లండన్లో తన రెండో బిడ్డకు జన్మనివ్వనుందని నెట్టింట వార్తలు వచ్చాయి. కానీ, వారెక్కడ ఉన్నది మాత్రం చెప్పలేదు. కానీ విషయం బయటపడేసరికి విరాట్ కొహ్లీ అజ్నాతవాసం ముగిసిందని మరికొందరు సరదాగా వాక్యానిస్తున్నారు.

మరి ఇంగ్లాండ్ తో జరిగే చివరి టెస్టుకైనా విరాట్ వస్తాడా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆల్రడీ సెలక్షన్ అయిపోయింది…ఇంక ఆ అవకాశం లేదని కొందరంటున్నారు. ఇంక ఐపీఎల్ లోనే కొహ్లీ కనిపిస్తాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Related News

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Big Stories

×