E-Paper
Advertisement

Hardik Pandya: హార్దిక్ పై కన్నేసిన నలుగురు భామలు

Hardik Pandya: హార్దిక్ పై కన్నేసిన నలుగురు భామలు
Advertisement

Hardik Pandya: మన పాండ్యా బాబు చిన్నోడేమీ కాదు. క్రికెట్ లో ఆల్ రౌండర్ అని అంతా అనుకుంటారు. కానీ బయట ఫీల్డ్ లో ఆల్ రౌండర్ లవర్ బాయ్ గా అవతారమెత్తాడు. క్రికెట్ ఆటను కూడా వదిలేసి గ్రీస్ దేశంలో తిరుగుతున్నాడు. ఇలా మనోడు ఖాళీగా ఉండటంతో హాట్ హాట్ భామలందరూ హార్దిక్ వెంట పడుతున్నారు.

‘నా పక్కన చోటున్నది ఒక్కరికే.. ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే’. అని నాటి అక్కినేని పాట పాడుకుంటూ, లవర్ బాయ్ టైపులో పూల చొక్కాలు వేసుకుని, నాలుగు బటన్స్ తీసి, స్విమ్మింగ్ ఫూల్స్ వద్ద సల్మాన్ ఖాన్ లా కండలు చూపిస్తూ.. ఫోజులిస్తుంటే.. ఏ అమ్మాయిలు మాత్రం ఆగుతారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

మరోవైపు పాండ్యా.. తన భార్య నటాషాకు కూడా విడాకులు ఇచ్చేశాడు. దీంతో తన స్పేస్ లోకి ఎవరో ఒకరు రావాలి. ప్రస్తుతం ఆ పనిలోనే పడినట్టుగా అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇప్పుడు హార్దిక్ అంటే ఇష్టమని నలుగురు భామలు ఓపెన్ గా చెప్పడం, తిరగడం నెట్టింట వేడి పుట్టిస్తోంది.

Also Read: క్రికెట్.. జట్టులోకి రాహుల్ ద్రావిడ్ కొడుకు, ఆస్ట్రేలియాతో..

Advertisement

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ సమయంలో, అనన్య పాండేతో హార్దిక్ సంబంధంపై వార్తలు వైరల్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం, నటి, హాట్ సింగర్ జాస్మిన్ వాలియాతో కూడా డేటింగ్ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఏకంగా గ్రీస్ లోని ఒక స్టార్ హోటల్ లో కలిసి ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి.

విడాకులకు ముందు హార్దిక్ భార్య నటాషా ఒకమ్మాయితో తను డేటింగ్ లో ఉన్నాడని బాంబ్ పేల్చింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరు ప్రాచీ సోలంకి అని, డిజిటల్ కంటెంట్ క్రియేటర్‌, మేకప్ ఆర్టిస్ట్ అని నెటిజన్ల రీసెర్చ్ లో తేలింది.

ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ నటి ఇషితా రాజ్ నెటిజన్లకు ఒక షాక్ ఇచ్చింది. తన క్రష్.. పాండ్యా అంటూ చెప్పుకొచ్చింది. పాండ్యా అంటే తనకు చాలా ఇష్టమని, తనని ప్రేమిస్తున్నట్టు తెలిపింది. తను సిక్స్ లు లాగిపెట్టి కొడుతుంటే, చూసేందుకు రెండు కళ్లు సరిపోవని ఎంతో ఎక్సయిటింగ్ గా తెలిపింది. దీంతో ఆల్ రౌండర్ లవర్ బాయ్ పాండ్యా మరోసారి వెలుగులోకి వచ్చాడు.

చాలామంది నెటిజన్లు ఏమంటున్నారంటే.. బాబూ లవర్ బాయ్ జాగ్రత్త. ఇలా ప్రేమిస్తూ.. విడాకులిస్తూ పోతే నీ ఆస్తులు సరిపోవు. అసలే ఆట వదిలేసి మరీ తిరుగుతున్నావ్ అని కూల్ గానే హెచ్చరిస్తున్నారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×