BigTV English

Sania Mirza: ఓటమితో కెరీర్‌కు సానియా మిర్జా వీడ్కోలు

Sania Mirza: ఓటమితో కెరీర్‌కు సానియా మిర్జా వీడ్కోలు

Sania Mirza: ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మిర్జా- రోహన్ బోపన్న జోడీ ఓడిపోయింది. బ్రెజిల్ జోడీ రాఫెల్ మాటోస్-లూయిసా స్టెఫానీ చేతిలో 7-6,6-2 తేడాతో ఓటమిపాలైంది. దీంతో విజయంతో గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించాలనుకున్న సానియా మిర్జా ఆశలు నిరాశలయ్యాయి. ఓటమితో టెన్నిస్ కెరీర్‌కు సానియా వీడ్కోల్ పలికారు.


దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సానియా మ్యాచ్ అనంతరం కన్నీళ్లుపెట్టుకున్నారు. తన ప్రొఫెషనల్ కెరీర్ మెల్‌బోర్న్‌లోనే మొదలైందని.. గ్రాండ్ స్లామ్ కెరీర్‌ను ముగించడానికి తనకు ఇంతకంటే మంచి వేదిక ఇంకేం ఉంటుందని సానియా అన్నారు. తన కొడుకు చూస్తుండగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ ఆడుతానని ఎప్పుడూ అనుకోలేదని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం సానియా కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

2009లో మహేశ్ భూపతితో కలిసి తన తొలి గ్రాండ్ స్లామ్ ఆడిన సానియా ఆ టోర్నీలో విజయం సాధించింది. మొత్తం ఐదు సార్లు గ్రాండ్ స్లామ్ ట్రోఫీలను సానియా గెలుచుకుంది. 11 సార్లు గ్రాండ్ స్లామ్‌లో ఫైనల్‌కు చేరుకుంది.


Related News

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Big Stories

×