Sai Durga SYT:మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈయన అనూహ్యంగా బైకు యాక్సిడెంట్లో ప్రమాదానికి గురై.. కొద్ది రోజులు కోమాలో ఉండి ఇప్పుడిప్పుడే కోలుకున్నారు. అందులో భాగంగానే తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ సినిమా చేసి డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత ‘విరూపాక్షా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయం అందించింది. ఇప్పుడు ‘సంబరాలు ఏటిగట్టు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సాయి దుర్గా తేజ్ 18వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులు కూడా చాలా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
రోహిత్ కేపీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. ఆరోజు ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG) సినిమా విడుదల ఉండడంతో ఈ సినిమాను వాయిదా వేశారు. ఇక త్వరలోనే అధికారిక ప్రకటన ప్రకటిస్తామని వెల్లడించారు. ఇకపోతే ఈరోజు దసరా సందర్భంగా ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తూ.. గ్లింప్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు సాయి దుర్గా తేజ్. తాజాగా ఆయన తన ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమా నుండీ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోందో తెలియాల్సి ఉంది.
ఆకట్టుకుంటున్న వీడియో..
ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో సాయి దుర్గా తేజ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది అని చెప్పవచ్చు. మరి భారీ అంచనాల మధ్య ఈ నెల 15వ తేదీన గ్లింప్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన సాయి దుర్గా తేజ్ అధికారిక విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఒకవేళ ఈ నెల 15న ఈ సినిమా గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారేమో తెలియాల్సి ఉంది.
సంబరాల ఏటిగట్టు సినిమా విశేషాలు..
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేకా శ్రీకాంత్, జగపతి బాబు, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సాయి దుర్గా తేజ్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
Asura Aagamana on OCT 15th 🙏🏼#HappyDussehra #SambaralaYetiGattu #SYGMovie pic.twitter.com/ogvpJiO38q
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 2, 2025