BigTV English

Ntr On Kanatara : కాంతారా విజన్‌కి సెల్యూట్… రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తిన ఎన్టీఆర్

Ntr On Kanatara : కాంతారా విజన్‌కి సెల్యూట్… రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తిన ఎన్టీఆర్

Ntr On Kanatara : రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతారా మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ వన్ సినిమాను సిద్ధం చేశాడు రిషబ్. ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. నిన్న మొదలైన ప్రీమియర్ సోర్స్ తోనే ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.


ఈ సినిమా తెలుగు ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించినప్పుడు ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఎన్టీఆర్ హాజరైనందుకు డ్రాగన్ సినిమా అప్డేట్స్ కూడా ఇస్తారు అని చాలామంది అభిమానులు ఎదురు చూశారు. కానీ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వలన కొద్దిసేపు మాత్రమే మాట్లాడారు. ఇక తాజాగా ట్విట్టర్ వేదికగా కాంతారా సినిమా గురించి స్పందించాడు ఎన్టీఆర్.

కాంతారా విజన్‌ కి సెల్యూట్

ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా.. అద్భుతమైన విజయాన్ని సాధించిన కాంతారా (KantaraChapter1 ) బృందానికి అభినందనలు. రిషబ్ శెట్టి సార్ ఒక అద్భుతమైన నటుడిగా మరియు అద్భుతమైన దర్శకుడిగా రాణించడం ద్వారా ఊహించలేనిదాన్ని సాధించారు. రిషబ్ సార్ దార్శనికతకు నిర్భయంగా మద్దతు ఇచ్చినందుకు హోంబాలే ఫిలిమ్స్ తో పాటు మొత్తం తారాగణం మరియు సిబ్బందికి నా శుభాకాంక్షలు. అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.


తక్కువ సందర్భాలు 

ఎన్టీఆర్ కొన్ని సినిమాలు గురించి మాట్లాడటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సినిమాలు గురించి మాట్లాడుతారు కానీ ఎన్టీఆర్ మాత్రం సినిమాలు గురించి ట్వీట్ చేయడం సినిమాల గురించి మాట్లాడటం తక్కువ.

రిషబ్ శెట్టి మీద ప్రత్యేకమైన ఇష్టం ఉండడంతో ఈవెంట్ కి హాజరు అవ్వడం మాత్రమే కాకుండా, సినిమా రిలీజ్ రోజే ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ట్వీట్ రావడం చిత్ర యూనిట్ కి కూడా కొంత బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పాలి. ఒక తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారు అని ఎప్పటినుంచో రుజువు అవుతూ వస్తుంది. ఇక ఈ సినిమాకి ఏ విధంగా బ్రహ్మరథం పడతారు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు ధనుష్ నటించిన ఇడ్లీ కడాయి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.

తెలుగు స్ట్రైట్ సినిమాలు దసరా రోజు వినిపించకపోయినా కూడా రెండు డబ్బింగ్ సినిమాలో కూడా తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. ఈ సినిమా దాదాపు 1000 కోట్లు సాధిస్తుంది అని చాలామంది అంచనా వేస్తున్నారు.

Also Read: Kantara Chapter1 : కాంతారా షో కలకలం… థియేటర్ బయట పూనకాలతో కొట్టుకున్న ఫ్యాన్ వీడియో

Related News

Varun Tej -Lavanya: ఘనంగా మెగా వారసుడి నామకరణ వేడుక..ఏం పేరు పెట్టారో తెలుసా?

Aswini Dutt: ఘనంగా నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

Sree Vishnu: హిట్ కాంబో రిపీట్ – శ్రీ విష్ణు కొత్త సినిమా మీద హైప్

Raju Gari gadhi 4: భయపడ్డానికి సిద్ధం కండి.. ఒళ్ళు గగుర్పొడిచే పోస్టర్ రిలీజ్!

Alia Bhatt: అలియాకు చేదు అనుభవం..చెయ్యి పట్టి లాగిన అభిమాని.. నటి రియాక్షన్ ఇదే!

Sai Durga SYT: దసరా స్పెషల్.. గ్లింప్స్ తోపాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్!

Kantara Chapter 1 : కాంతారా చాప్టర్ 1 ఎఫెక్ట్.. అభిమానికి పూనకాలు, థియేటర్ బయట కేకలు పెడుతూ…

Big Stories

×