BigTV English

Alia Bhatt: అలియాకు చేదు అనుభవం..చెయ్యి పట్టి లాగిన అభిమాని.. నటి రియాక్షన్ ఇదే!

Alia Bhatt: అలియాకు చేదు అనుభవం..చెయ్యి పట్టి లాగిన అభిమాని.. నటి రియాక్షన్ ఇదే!

Alia Bhatt: సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వస్తే వారితో సెల్ఫీలు దిగాలని అభిమానులు ఎంతో ఉత్సాహం కనబరుస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం కారణంగా సెలబ్రిటీలు కూడా ఇబ్బందులని ఎదుర్కొంటూ ఉంటారు . ఇలా పలు సందర్భాలలో అభిమానుల నుంచి సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్(Alia Bhatt) సైతం ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొంది. నేడు విజయదశమి కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలు దుర్గ పూజ పండల్(Durga Pooja Pandal) ఏర్పాటు చేశారు. నటి కాజోల్(Kajol), రాణి ముఖర్జీ (రాణి Mukerji)వంటి వారు ఈ దుర్గా పూజ పండల్ ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పండల్ దర్శించి సందడి చేస్తున్నారు.


చెయ్యి పట్టి లాగిన అభిమాని…

ఈ క్రమంలోనే కాజోల్ ఏర్పాటు చేసిన పూజ పండల్ దర్శనం కోసం అలియా బట్ వచ్చారు. ఈ సమయంలోనే ఒక అభిమాని నుంచి ఆమెకు చేదు అనుభవం ఎదురయింది. అలియాతోపాటు ప్రముఖ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ కూడా కలిసి వచ్చారు. చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఓ మహిళ మాత్రం అందరిని తోసుకుంటూ వచ్చి ఆలియా చెయ్యి పట్టి లాగడంతో ఒక్కసారిగా గందరగోల వాతావరణం ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా సెక్యూరిటీ ఆ అభిమానిని పక్కకు లాగే ప్రయత్నం చేయడంతో అలియా భట్ చాలా ప్రశాంతంగా వ్యవహరించారు.

అలియా తీరుపై ప్రశంసలు..

అభిమానిని తోసి వేయొద్దు అంటూ తన సెక్యూరిటీకి చెప్పడమే కాకుండా అనంతరం ఆమెతో కలిసి సెల్ఫీ దిగి అక్కడి నుంచి పంపించి పరిస్థితిని చక్కగా హ్యాండిల్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అలియా వ్యవహరించిన తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దుర్గా పూజ పండల్ వద్ద అలియా భట్ పలువురు సెలబ్రిటీలతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆలియా కెరియర్ విషయానికి వస్తే.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈమె బ్రహ్మాస్త్ర 1 సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాలో అలియాతో పాటు రణబీర్ కపూర్ కూడా నటించిన సంగతి తెలిసిందే.


?igsh=cW14Znp5bjhoam55

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో త్వరలోనే బ్రహ్మాస్త్ర 2 సినిమా పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం అలియా భట్ ఆల్ఫా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇలా కెరియర్ తరంగా వరుస సినిమాలలోనూ, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ అలియా భట్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈమెకు కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్ కు జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత అలియా నటించిన బాలీవుడ్ సినిమాలు కూడా తెలుగులో విడుదలవుతూ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి.

Related News

Varun Tej -Lavanya: ఘనంగా మెగా వారసుడి నామకరణ వేడుక..ఏం పేరు పెట్టారో తెలుసా?

Aswini Dutt: ఘనంగా నిర్మాత అశ్వినీ దత్ కుమార్తె నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

Sree Vishnu: హిట్ కాంబో రిపీట్ – శ్రీ విష్ణు కొత్త సినిమా మీద హైప్

Raju Gari gadhi 4: భయపడ్డానికి సిద్ధం కండి.. ఒళ్ళు గగుర్పొడిచే పోస్టర్ రిలీజ్!

Ntr On Kanatara : కాంతారా విజన్‌కి సెల్యూట్… రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తిన ఎన్టీఆర్

Sai Durga SYT: దసరా స్పెషల్.. గ్లింప్స్ తోపాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్!

Kantara Chapter 1 : కాంతారా చాప్టర్ 1 ఎఫెక్ట్.. అభిమానికి పూనకాలు, థియేటర్ బయట కేకలు పెడుతూ…

Big Stories

×