Tamilnadu Accident: దసరా పండుగ వేళ తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి మున్నార్‌కు ట్రిప్‌కి వెళ్తున్నారు ఐదుగురు యువకులు. కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ ప్రమాదం ఎలా జరిగింది? తప్పు ఎవరిది? అన్న లోతుల్లోకి వెళ్తే..
ప్రమాదం ఎలా జరిగింది?
తమిళనాడులోని విలుప్పురం జిల్లా విక్రవండి చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు చెన్నై పరిసర ప్రాంతాలైన కోలత్తూర్, అవడి ప్రాంతాలకు చెందినవారు.
తంగవేల్, ఉమానాథన్ సహా మరో ముగ్గురు కలిసి గురవారం ఉదయం కారులో మున్నార్‌కు విహారయాత్రకు బయలు దేరారు. కారు విలుప్పురం జిల్లా విక్రవండి ప్రాంతానికి చేరుకుంది. అది చెన్నై-త్రిచి నేషనల్ హైవే. అతివేగంగా వెళ్తున్న కారు.. లారీని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.
విహారయాత్రలో విషాదం
తొలుత మీడియంను ఢీకొట్టిన కారు ఆ తర్వాత లారీ వంతైంది. దాదాపు 50 మీటర్లు ఈడ్చుకుపోయింది కారు. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఫలితంగా కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక-రెస్క్యూ బృందాలు అక్కడకి చేరుకున్నాయి. ఈలోగా స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విక్రవాండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: యువతి గొంతుకోసిన యువకుడు, ఆ తర్వాత
కారు వేగంగా నడుపుతూ లారీని అధిగమించడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తేలింది. ఈ ప్రమాదం కారణంగా హైవేపై గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి, వాహనాలు వెళ్లేందుకు లైన్ క్లియర్ చేశారు.
తంగవేల్, ఉమానాథన్ తోపాటు మరొకరు మృతి చెందారు. ఈ విషయం తెలియగానే మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు.
పండగ పూట తమిళనాడులో విషాదం
కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనం
తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని ఆస్పత్రికి తరలింపు
చెన్నై నుంచి మున్నార్‌కు ట్రిప్‌కి వెళ్తున్న యువకులు
విక్రవాండి వద్ద నాగమ్మాయి కాటన్ మిల్లు సమీపంలో సెంటర్ మీడియంను ఢీకొట్టిన కారు pic.twitter.com/34USbUGzFs
— BIG TV Breaking News (@bigtvtelugu) October 2, 2025