Abhishek Sharma: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ హీరో అభిషేక్ శర్మ ( Abhishek Sharma ).. గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఐపీఎల్ లో మెరుస్తున్న అభిషేక్ శర్మ ఇప్పుడు ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో కూడా రియల్ హీరోగా మారిపోయాడు. 300కు పైగా పరుగులు చేసి జట్టును చాంపియన్గా నిలిపిన ఘనత అభిషేక్ శర్మది. అయితే అలాంటి అభిషేక్ శర్మ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అభిషేక్ శర్మ చెల్లెలు కోమల్ శర్మ ( abhishek sharma sister Komal Sharma ) హల్దీ ఫంక్షన్ తో పాటు తాజాగా పెళ్లి కూడా జరిగినట్లు ఫోటోలు అలాగే వీడియోలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా యువరాజు ( Yuv raj) కూడా సందడి చేశాడు. అతడు డాన్స్ చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది.
ఆసియా కప్ 2025 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అభిషేక్ శర్మ చెల్లెలు కోమల్ శర్మ వివాహం తాజాగా జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు కానీ హల్దీ ఫంక్షన్ తో పాటు ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలు బయట వైరల్ అవుతున్నాయి. మొదటగా అభిషేక్ శర్మ తన చెల్లెలు కోమల్ శర్మ… ఆల్ ది ఫంక్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులతో.. ఫోటోలు దిగి రచ్చ చేశాడు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ సాంప్రదాయ బట్టలు కనిపించాడు. అటు అభిషేక్ శర్మ చెల్లెలు కోమల్ శర్మ ఎప్పటిలాగే చాలా ఆక్టివ్ గా కనిపించారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పూర్తికాగానే అభిషేక్ శర్మ తన చెల్లెలి వివాహాన్ని జరిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా అభిషేక్ శర్మ ఇంట్లో పండగకు… ఆయన కోచ్ యువరాజ్ సింగ్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ఊర మాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. అభిషేక్ శర్మ, యువరాజ్ సింగ్ తో పాటు అభి తండ్రి కూడా పాల్గొన్నారు. ఈ ముగ్గురు హిందీ సాంగ్స్ పెట్టుకొని డాన్సులు వేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇది ఇలా ఉండ గా ఆసియా కప్ 2025 టోర్నమెంటులో 300కు పైగా పరుగులు చేసి టీం ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు అభిషేక్ శర్మ. ప్రతి మ్యాచ్లో 30కి పైగా పరుగులు చేయడంతో పాటు దాదాపు 300 కు పైగా పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్…గా నిలిచిన అభిషేక్ శర్మకు ప్రత్యేక కారు కూడా గిఫ్టుగా వచ్చింది. ఈ కారు ధర దాదాపు 33 లక్షలు గా ఉంటుంది.
Yuvraj Singh and ABHISHEK Sharma dancing together at abhi's sister wedding ❤️.
– Two of the finest left handed batsmen ever produced by India 🥵!! pic.twitter.com/E3m3Agd9Ah
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) October 1, 2025
Abhishek Sharma with his sister in her Mehndi function. ♥️
– A beautiful picture! pic.twitter.com/OS6LAj9zFp
— Tanuj (@ImTanujSingh) October 1, 2025