IND VS WI: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ఇన్ని రోజులు ఫుల్ బిజీగా ఉన్న టీమిండియా ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ కు సిద్ధమైంది. ఇవాల్టి నుంచి టెస్టులు ఆడనుంది. వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తొలి టెస్ట్ జరగనుంది. గిల్ సారాద్యంలో వెస్టిండీస్ జట్టుతో టీమ్ ఇండియా తలబడనుంది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇవాల్టి నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఇందులో మొదటి టెస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటికే మోడీ స్టేడియంలో టీం ఇండియా అలాగే వెస్టిండీస్ జట్లు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. మరికొన్ని క్షణాల్లోనే రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటల సమయంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. 9:30 గంటలకు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. గిల్ సారాద్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియా… ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. అటు వెస్టిండీస్ జట్టులో కీలక ప్లేయర్ లందరూ దూరమయ్యారు. దీనికి తోడు ఇండియా గడ్డపైన మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి కచ్చితంగా గిల్ జట్టు విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ టెస్ట్ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ లో తిలకించవచ్చు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో ఎలాంటి స్పాన్సర్ జెర్సీ లేకుండానే టీమ్ ఇండియా బరిలోకి దిగి సక్సెస్ అందుకుంది. అయితే వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అపోలో టైర్స్.. జెర్సీతో గిల్ జట్టు బరిలోకి దిగనున్నట్లు.. అధికారికంగా వెల్లడించారు అధికారులు. ప్రాక్టీస్ లో కూడా గౌతమ్ గంభీర్ తో పాటు టీమిండియా ప్లేయర్ లందరూ అపోలో టైర్స్ జెర్సీ ధరించారు. ఈ వెస్టిండీస్ టెస్ట్ తో కూడా కొత్త జెర్సీలోనే బరిలోకి దిగనున్నారు. దాదాపు 579 కోట్లు చెల్లించి మరి అపోలో టైర్స్.. ఈ హక్కులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 2027 వరకు అపోలో టైర్స్…. టీమ్ ఇండియా జట్టుకు స్పాన్సర్ గా ఉండనుంది.
భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (C), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(w), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.
వెస్టిండీస్ జట్టు: జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్(C), షాయ్ హోప్(w), జస్టిన్ గ్రీవ్స్, ఖరీ పియరీ, జోహన్ లేన్, అండర్సన్ ఫిలిప్.
Team is back in training ahead of the series#INDvsWI #ShubmanGill #gautamgambhir pic.twitter.com/l2kK4fGCJG
— Sports Yaari (@YaariSports) September 30, 2025