Sree Vishnu: వెబ్ డిజైనర్ కెరియర్ మొదలుపెట్టిన శ్రీ విష్ణు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన మెంటల్ మధ్యలో సినిమాతో హీరోగా మారిపోయాడు శ్రీ విష్ణు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కూడా ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు.
శ్రీ విష్ణు కెరియర్ లో కొన్ని కాన్సెప్ట్ బేస్ సినిమాలు ఉన్నాయి. అవి కమర్షియల్ గా ఊహించిన సక్సెస్ సాధించలేకపోవచ్చు. హసిత్ గోలి దర్శకత్వంలో వచ్చిన రాజరాజ చోరా సినిమా చాలామందికి ఫేవరెట్. అయితే ఆ సినిమాకి ఊహించిన సక్సెస్ రాలేదు. వరుసగా శ్రీ విష్ణుకు సినిమా అవకాశాలు వచ్చినప్పుడు ప్రతి దాన్ని చేసుకుంటూ కెరియర్లో ముందుకెళ్లాడు. ఆ సినిమాలేవి ఊహించిన సక్సెస్ తీసుకురాలేకపోయాయి. సామజవరగమన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించి దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
సామజవరగమన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాను మినీ నువ్వు నాకు నచ్చావ్ అని కూడా కొంతమంది ప్రశంసించారు. ముఖ్యంగా శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత శ్రీ విష్ణు ముందు సినిమాల్లో ఎటువంటి డబుల్ మీనింగ్స్ తప్పించుకుని మాట్లాడాడు వెతుక్కుని మరి చూశారు.
ఇకపోతే మళ్లీ ఇదే కాంబినేషన్లో సినిమా రాబోతుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తపు పూజ నేడు మొదలైంది. సాయి ధరమ్ తేజ్, వివేక్ ఆత్రేయ, వెన్నెల కిషోర్, సీనియర్ నటులు నరేష్, కమెడియన్ సుదర్శన్ తో పాటు చాలామంది ఈ ముహూర్తపు పూజకు హాజరయ్యారు.
ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు, ఆ కాంబినేషన్ లో మరో సినిమా విడుదలయితే ఖచ్చితంగా హైప్ పెరగడం అనేది కామన్ గా జరుగుతుంది. ఈ తరుణంలో ఈ సినిమా మీద కూడా మంచి హైప్ పెరుగుతుంది. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలానే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
Also Read: Ntr On Kanatara : కాంతారా విజన్‌కి సెల్యూట్… రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తిన ఎన్టీఆర్