Ashwin Un sold : ఇంటర్నేషనల్ టీ-20 లీగ్ వేలంలో టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కి ఘోర అవమానం ఎదురైంది. రూ.1.06 కోట్ల కనీస ధరతో తొలి రౌండ్ వేలంలోకి వచ్చిన అశ్విన్ ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. ఈ ఏడాది ఆగస్టులో ఐపీఎల్ నుంచి రైటైర్డ్ అయ్యాడు అశ్విన్. దీంతో విదేశీ లీగ్ ల్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఐఎల్ టీ 20 వేలంలో తన పేరును అశూ రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ ఈ సీనియర్ స్పిన్నర్ తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాకపోవడం విశేషం. దీంతో అశ్విన్ అన్ సోల్డ్ గా మిగిలిపోవడం గమనార్హం.
Also Read : BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివచ్చిన నఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ
ముఖ్యంగా అశ్విన్ కి అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లో కూడా అద్భుతమైన ట్రాక్ రికార్డు నమోదై ఉంది. ఐపీఎల్ తో పాటు 5 ఫ్రాంచైజీల తరపున 221 మ్యాచ్ లు ఆడిన అశ్విన్.. 187 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2010, 2012 సీజన్లలో ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు భాగంగా ఉన్నాడు. ఈ తమిళనాడు స్పిన్నర్ మొత్తం 333 టీ 20 మ్యాచ్ ల్లో 317 వికెట్లు తీశాడు. 1233 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 2009 నుంచి 2025 మధ్య చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ ఐదు జట్ల తరపున మొత్తం 221 మ్యాచ్ లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. మే 20, 2025న ఢిల్లీలో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి.. రెండు వికెట్లు తీసుకున్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు. భారత్ తరపున 65 టీ20ల్లో 184 పరుగులు చేసి 72 వికెట్లు పడగొట్టాడు.
గత సీజన్ లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. అతనికీ చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అలాంటి ఆటగాడు ఐఎల్ టీ20 వేలంలో అమ్ముడుపోకపోవడం ఇప్పుడూ అందరినీ ఆశ్చర్యపరచడం విశేషం. మరోవైపు భారత స్పిన్నర్ కి ఆస్ట్రేలియా బిగ్ బాష లీగ్ లో ఆడేందుకు మాత్రం మార్గం సుగమమైంది. బిగ్ బాష్ లీగ్ సీజన్ 15లో సిడ్నీ థండర్స్ తరపున ఆడేందుకు అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బీబీఎల్ లో సిడ్నీ థండర్స్ కి ప్రాతినిధ్యం వహించిన తొలి భారత మెన్స్ క్రికెటర్ అశ్విన్ నిలువనున్నాడు. అశ్విన్ గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన విషయం విధితమే. వాస్తవానికి అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలుకకుండా ఉంటే.. ఐపీఎల్ అద్భుతంగా ఆడేవాడు. కానీ ఐపీఎల్ కి అన్నింటికీ రిటైర్డ్ అయ్యాడు. అస్సలు అశ్విన్ కి ఇలా జరుగుతుందని అతను కలలో కూడా ఊహించలేదు.