BCCI : ఆసియా కప్ 2025 ట్రోఫీని టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు భారత క్రికెట్ జట్టు అంగీకరించలేదు. దాదాపు గంట సేపటి తరువాత అవార్డులను అందజేశారు. అయినప్పటికీ టీమిండియా ఆటగాళ్లు అందుకోలేదు. టీమిండియా ఆటగాళ్లు అందుకోనందుకు కావాలని ఏసీసీ చీఫ్ నఖ్వీ కావాలనీ ట్రోఫీ తో పాటు మెడల్స్ ని కూడా తీసుకెళ్లాడు. దీంతో ఇప్పుడు వివాదం మొదలైంది. దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీసీ సర్వసభ్య సమావేశంలో కొంచెం ఘాటుగానే స్పందించింది.
Also Read : AUS Vs NZ : రాబిన్సన్ సెంచరీ చేసినా.. ఆస్ట్రేలియానే విజయం
మరోవైపు ఐసీసీ రూల్స్ ప్రకారం.. ట్రోఫీ, మెడల్స్ ను భారత క్రికెట్ బోర్డుకు అప్పగించకుండా నఖ్వీ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవైపు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆఫీస్ కి వచ్చి వాటిని తీసుకోవాలని తొలుత మెలిక పెట్టినట్టు సమాచారం. దీంతో ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి బీసీసీఐ తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదేవిధంగా ట్రోఫీ చౌర్యం, నియమాల ఉల్లంఘన నేపథ్యంలో నఖ్వీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ పదవీ నుంచి తొలగించి అతని పై చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ఐసీసీ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. ఇక భవిష్యత్ లో జరుగబోయే పరిణామాలకు బెదిరిపోయి. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ బోర్డుకు అందించినట్టు సమాచారం.
Also Read : Ind vs WI, 1st Test: రేపటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్..జట్ల వివరాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే
ఈ ట్రోఫీని మాత్రం యూఏఈ బోర్డు టీమిండియా కి ఎలా అందించనుందనే విషయం ఇప్పటివరకు అయితే అధికారికంగా ప్రకటన వెలువడలేదు. మంగళవారం వర్చువల్ గా జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు రాజీవ్ శుక్లా, ఆశిష్ షెలార్ నఖ్వీని ప్రశ్నించారట. దీంతో నఖ్వీ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఆసియా కప్ 2025 ట్రోఫీ ఏ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి గత ఆస్తి కాదని.. సమావేశంలో తేల్చి చెప్పినట్టు సమాచారం. యూఏఈ ఏవిధంగా, ఎప్పుడూ టీమిండియా ఇస్తుందనేది త్వరలోనే తేలనుంది. వాస్తవానికి ఈ ట్రోఫీ గొడవ కేవలం ఒక్కసారి మాత్రమే మొదలవ్వలేదు. టోర్నమెంట్ అంతటా భారత్, పాకిస్తాన్ తో హ్యాండ్ షేక్ ఇవ్వకుండా ఓ ప్రత్యేక విధానాన్ని పాటించింది. మాజీ ఆటగాళ్లు, టీవీ నిపుణులు, సామాన్యుల మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. భారత జట్టు తొలుత ఐక్యతతో వ్యవహరించినప్పటికీ పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానంలో ఇండియాను రెచ్చగొట్టేలా చెడ్డ చేష్టలు చేసారు. దీనికి ఆటగాళ్లకు జరిమానాలు కూడా విధించారు. ఫైనల్ రాత్రి కెప్టెన్ లను ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు ఇంటర్వ్యూ చేయడం వంటివి ఉద్రిక్తతను మరింత పెంచాయి.