BigTV English

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

AUS Vs NZ :  ఆస్ట్రేలియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య ప్ర‌స్తుతం చాపెల్-హాడ్లీ టీ 20 ట్రోపీ 2025 జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఇవాళ జ‌రిగిన తొలి టీ 20లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత న్యూజిలాండ్ జ‌ట్టు బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 23 ఏళ్ల టిమ్ రాబిన్సన్ అద్భుతమైన సెంచరీతో రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. రాబిన్సన్ 65 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీని సాధించాడు. రాబిన్సన్ 19.5 ఓవర్లలో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో తన తొలి సెంచరీని పూర్తి చేశాడు. దీంతో న్యూజిలాండ్ తమ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.


Also Read : Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

రాబిన్స‌న్ అద్భుత‌మైన సెంచ‌రీ..

రాబిన్సన్ 66 బంతుల్లో 106 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో అజేయంగా నిలిచాడు. రాబిన్సన్ రెండవ ఓవర్‌లో క్రీజులోకి వచ్చాడు. న్యూజిలాండ్ జట్టు కేవలం ఆరు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. రాబిన్సన్ ఇప్పుడు న్యూజిలాండ్ యొక్క రెండవ అతి పిన్న వయస్కుడైన టీ20 సెంచరీ అయ్యాడు. రచిన్ రవీంద్ర గాయపడ్డాడు. అతని స్థానంలో వచ్చాడు శిక్షణ సమయంలో స్టార్ బ్యాట్స్‌మన్ రాచిన్ రవీంద్ర ముఖానికి తీవ్ర గాయం కావడంతో టిమ్ రాబిన్సన్‌ను న్యూజిలాండ్ జట్టులో చేర్చారు. రాచిన్ సిరీస్ నుండి తప్పుకున్నప్పుడు రాబిన్సన్ పరిస్థితి మారిపోయింది. T20 ప్రపంచ కప్ తయారీ 2026 T20 ప్రపంచ కప్‌న‌కు సన్నాహకంగా.. న్యూజిలాండ్- ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల చాపెల్-హాడ్లీ ట్రోఫీ సిరీస్‌ను ఆడుతున్నాయి. ఇవాళ‌ మౌంట్ మౌంగనుయ్‌లోని బే ఓవల్‌లో ప్రారంభమైంది. రెండో మ్యాచ్ అక్టోబ‌ర్ 3న‌, మూడో మ్యాచ్ అక్టోబ‌ర్ 04న జ‌రుగ‌నున్నాయి.


Also Read : Mohsin Naqvi : సూర్య.. నా ఆఫీస్‍‌కొచ్చి కప్పు తీసుకెళ్లు… నఖ్వీ కొత్త కండీష‌న్లు

మార్స్ కీల‌క విన్నింగ్ ఇన్నింగ్స్

ఇక ఆస్ట్రేలియా బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్ 85, హెడ్ 31, షార్ట్ 29, టిమ్ డేవిడ్ 21, కార్వే 7, స్టోయినీస్ 4 ప‌రుగులు చేయ‌డంతో 16.3 ఓవ‌ర్ల‌లోనే ఆస్ట్రేలియా జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో హెన్రీ 2, ఫోల్క్స్ 1, జెమీస‌న్ 1 చొప్పున వికెట్లు తీశారు. అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన షిఫ‌ర్ట్ 4, కాన్వే 1, రాబిన్స‌ర్ 106, చంప‌న్ డ‌కౌట్. మిచెల్ 34, జాకోబ్ 20, బ్రేస్ వెల్ 7 ప‌రుగులు చేయ‌డంతో న్యూజిలాండ్ జ‌ట్టు 181జ 6 ప‌రుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో హెజిల్ వుడ్ 1, డ్వార్షుస్ 2, మ్యాథ్య్స్ షార్ట్‌ 1 చొప్పున వికెట్లు తీసుకున్నారు. మొత్తానికి న్యూజిలాండ్ బ్యాట‌ర్ సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు రెచ్చిపోవ‌డంతో న్యూజిలాండ్ ల‌క్ష్యాన్ని అల‌వొక‌గా ఛేదించారు. న్యూజిలాండ్ మీద ఎప్పుడూ కూడా ఆస్ట్రేలియా జ‌ట్టే పైచేయి సాధిస్తుంది. ఇంకా రెండు టీ-20 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచ్ ల్లో క‌నుక ఆస్ట్రేలియా జ‌ట్టు విజ‌యం సాధిస్తే.. క‌చ్చితంగా సిరీస్ గెలుస్తుంది. న్యూజిలాండ్ గెలిస్తే.. న్యూజిలాండ్ గెలిస్తే ఆ జ‌ట్టు సిరీస్ ను కైవ‌సం చేసుకుంది.

Related News

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

Tilak-Dube : శివమ్ దూబేకు తిలక్ వర్మ వెన్నుపోటు…? గంభీర్ కు జరిగిన అన్యాయమే ఇప్పుడు రిపీట్

Mohsin Naqvi : సూర్య.. నా ఆఫీస్‍‌కొచ్చి కప్పు తీసుకెళ్లు… నఖ్వీ కొత్త కండీష‌న్లు

Vaibhav Suryavanshi : ఆస్ట్రేలియాపై సూర్యవంశీ సూపర్ సెంచరీ… ఏకంగా 8 సిక్సర్లు

Tilak Verma : త‌మ్ముడు తిల‌క్‌…ఆంధ్ర వాడి దెబ్బ.. పాకిస్తాన్ వాడి అబ్బా… జై జగన్ అంటూ

Saeed Ajmal Cheque : పాక్ PM ఇచ్చిన చెక్కులు బౌన్స్..ఆ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం

Ind vs SL: వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ… శ్రీలంక చిత్తు చిత్తు

Big Stories

×