Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ.. మంచి వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగులో 8 సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు “డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్” అంటూ సీజన్ 9 ప్రారంభం అయింది.. ఈ సారి “చదరంగం కాదు రణరంగమే” అంటూ నాగార్జున ఎప్పుడైతే సీజన్ పై హైప్ పెంచేశారో అప్పటినుంచి ఈ సీజన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే అటు కంటెస్టెంట్స్ కూడా హౌస్ లో తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సీజన్లోకి 6 మంది కామర్నర్స్.. 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇదిలా ఉండగా ఇప్పటికే మూడు వారాలు పూర్తికాగా .. నాల్గవ వారం కూడా ప్రారంభం అయింది. ఇక ఈవారం నామినేషన్స్ లోకి మొత్తం 6 మంది వచ్చేశారు. ఇక దమ్ము శ్రీజ లేదా దివ్యా నికిత ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పోలింగ్ కూడా చెబుతోంది. మరి శుక్రవారం పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో వారు సేవ్ అవుతారని చెప్పవచ్చు. తాజాగా 25వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ గేమ్ కోసం ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టినట్లు తెలుస్తోంది.
హిప్పో ఆకలి తీర్చడానికి భారీ కష్టాలు..
25వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమో విషయానికి వస్తే.. పవర్ కార్డ్స్ పొందడం కోసం నేను మీకు ఇస్తున్న ఛాలెంజ్ హంగ్రీ హిప్పో. ఆకలితో ఉన్న హిప్పో నోటిలో బాల్స్ వేసి దానికి తినిపించడం. ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ తినిపిస్తుందో ఆ టీం విజేత అయినట్టు అంటూ బిగ్ బాస్ ప్రకటించారు. కంటెస్టెంట్స్ మాత్రం ఎవరికి వారు గట్టిగానే పోరాడారు . ఇక ఆఖరి బాల్ కోసం పోరాడిన తీరు చూస్తుంటే ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టేస్తారేమో అనిపించిందని అటు ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే లాస్ట్ లో దమ్ము శ్రీజ బాల్ ను పట్టుకొని హిప్పో నోటిలో వేసే ప్రయత్నం చేయగా.. మధ్యలో ఇమ్మానియేల్ వచ్చి ఆ బాలును లాగేసుకోవడం.. చివరికి రెడ్ టీం కి పాయింట్ ఇవ్వడంతో తనూజ గట్టిగా అరిచేసింది. ఇవ్వాలనుకుంటే ఇవ్వండి కానీ అంత కష్టపడినా అన్యాయం చేయడం తప్పు అంటూ తనూజ మండిపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
also read:Sai Durga SYT: దసరా స్పెషల్.. గ్లింప్స్ తోపాటు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్!
పవర్ కార్డ్స్ కోసం భారీ తిప్పలు..
ఏదేమైనా కంటెస్టెంట్స్ మధ్య పవర్ కార్డ్స్ కోసం పెట్టిన టాస్కులు భారీగా శారీరకంగా, మానసికంగా వారిని ఇబ్బంది పెడుతున్నాయి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తాజాగా విడుదలైన ఈ ప్రోమో ఇప్పుడు షో పై మరింత అంచనాలు పెంచేస్తోంది.