IND VS WI: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఇవాల్టి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులపాటు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టి20 లో ఆడిన టీమిండియా… వారం తిరగకముందే ఇప్పుడు టెస్టులు ఆడనుంది. టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ నేపథ్యంలో టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఉచితంగా మనం చూడవచ్చు.టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ తొమ్మిదిన్నర గంటలకు ప్రారంభం కానుంది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జెట్ల మధ్య టెస్ట్ సిరీస్ లో రికార్డు చూస్తే.. వెండిస్ పై చేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అప్పట్లో… వెస్టిండీస్ జ ట్టు అద్భుతంగా ఆడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుస ఓటములతో సతమతమవుతోంది వెస్టిండీస్ జట్టు. ఇక ఇప్పటివరకు టీం ఇండియా అలాగే వెస్టిండీస్ మధ్య 100 టెస్టులు జరిగాయి. ఇందులో 30 మ్యాచ్ లలో వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 23 మ్యాచ్ లలోనే టీమిండియా విజయం సాధించింది. దాదాపు 47 మ్యాచులు డ్రా అయ్యాయి.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ నేపథ్యంలో కొత్త జెర్సీలో గిల్ కనిపించారు. అపోలో టైర్స్… పేరుతో ఉన్న కొత్త జెర్సీ ని గిల్ ధరించి టాస్ ప్రక్రియలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. దాదాపు 570 కోట్లతో జెర్సీ రైట్స్ కొనుగోలు చేసిందట అపోలో టైర్స్. 2027 వరకు వీళ్ళ ఒప్పందం కొనసాగునున్నట్లు సమాచారం.
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (C), ధ్రువ్ జురెల్(w), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): టాగెనరైన్ చందర్‌పాల్, జాన్ క్యాంప్‌బెల్, అలిక్ అథానాజ్, బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(w), రోస్టన్ చేజ్(c), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖరీ పియర్, జోహన్ లేన్, జేడెన్ సీల్స్
Gill said "I Spoke to Sachin sir & Steve Smith before travelling for the England series". [Star Sports] pic.twitter.com/IfYGhbmqRu
— Johns. (@CricCrazyJohns) October 2, 2025