Aswini Dutt: టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతోమంది సెలబ్రిటీలు ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. త్వరలోనే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట పెళ్లి భాగాలు మోగబోతున్నాయనే శుభవార్త తెలిసినదే. అల్లు శిరీష్ త్వరలోనే తన నిశ్చితార్థం జరగబోతోంది అంటూ అధికారికంగా వెల్లడించారు. అయితే తాజాగా మరో నిర్మాత ఇంట్లో కూడా శుభకార్యం జరిగినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వైజయంతి బ్యానర్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నిర్మాత అశ్వినీ దత్(Aswini Dutt) ఒకరు.
నిర్మాతగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన ఈయనకు ముగ్గురు కుమార్తెలను విషయం మనకు తెలిసిందే. ఇదివరకే స్వప్న దత్, ప్రియాంక వివాహం చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యారు. ఇక మూడో కుమార్తె స్రవంతి దత్ (Sravanthi Dutt)త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఈమె నిశ్చితార్థపు(Engagment) వేడుకలు హైదరాబాదులో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రస్తుతం స్రవంతి దత్ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ముగ్గురు అక్క చెల్లెలు కూడా తమ తండ్రి తర్వాత వైజయంతి బ్యానర్స్ వ్యవహారాలను చూసుకుంటూ నిర్మాతలుగా కొనసాగుతున్నారు.
ఇప్పటికే ఈ బ్యానర్ పై స్వప్న ప్రియాంక ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతారామం, కల్కి వంటి సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇలా అశ్విని ఇద్దరు కుమార్తెలు అందరికీ ఎంతో సుపరిచితమైనప్పటికీ మూడో కుమార్తె గురించి పెద్దగా ఎవరికి తెలియదనే చెప్పాలి. స్రవంతి నిశ్చితార్థం జరగడంతో ఈ ఏడాదిలోనే వీరి వివాహం కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి స్రవంతి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు ఏంటి అని విషయాలు మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.
హాజరైన సినీ రాజకీయ ప్రముఖులు..
రెండో కుమార్తె ప్రియాంక ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈయనకు కాబోయే మూడో అల్లుడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాల్సి ఉంది. ఈ విధంగా అశ్వినీ దత్ కుమార్తె నిశ్చితార్థానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం వైజయంతి సినీ బ్యానర్ లో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. త్వరలోనే కల్కి 2 కూడా ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా, ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. కల్కి సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.
Also Read: Alia Bhatt: అలియాకు చేదు అనుభవం..చెయ్యి పట్టి లాగిన అభిమాని.. నటి రియాక్షన్ ఇదే!