Marcus Stoinis: ఆస్ట్రేలియా డేంజర్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ గురించి తెలియని వారు ఉండరు. జట్టులో కీలక పాత్ర పోషిస్తూ… ఒంటి చేత్తో అనేక విజయాలను కూడా అందించాడు మార్కస్ స్టోయినిస్. అయితే అలాంటి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ తాజాగా చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తోంది. బౌలింగ్ చేసేందుకు వెళ్లి ఏకంగా తన జెర్సీ మొత్తం విప్పేశాడు మార్కస్ స్టోయినిస్. అది కావాలని చేశాడో? లేక పొరపాటులో చేశాడో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ అరుదైన సంఘటన న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో చోటు చేసుకుంది.
న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా నిన్నటి రోజున ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఓవల్ వేదికగా జరిగిన ఈ టి20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టులో చిత్తు చేసింది ఆస్ట్రేలియా.
అయితే ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేయడానికి వచ్చిన మార్కస్ స్టోయినిస్…. చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తోంది. బౌలింగ్ చేయడానికి వచ్చి… తన జెర్సీ మొత్తం విప్పేసి హల్చల్ చేశాడు మార్కస్. ఆ తర్వాత రియలైజ్ అయి అంపైర్ తో… కాసేపు ముచ్చటించి అనంతరం తిరిగి జెర్సీ ధరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తట్టు నిర్ణయిత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టుకు సంబంధించిన టీం రాబిన్సన్ ఏకంగా సెంచరీ చేసి దుమ్ము లేపాడు. 66 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఆరు బౌండరీలు అలాగే 106 పరుగులు చేశాడు. అయితే బౌలింగ్లో న్యూజిలాండ్ విఫలం కావడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. న్యూజిలాండ్ ఇచ్చిన టార్గెట్ ను 16.3 ఓవర్ లో ఫినిష్ చేసింది ఆస్ట్రేలియా. కేవలం నాలుగు టికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేదించి… రఫ్ ఆడించింది ఆస్ట్రేలియా.
ఇటీవల ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ తొలివారం లోనే సారా జార్నుచ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు మార్కస్. వీళ్ళ వివాహం కూడా త్వరలోనే జరుగనుంది. దీంతో మార్కస్ స్టోయినిస్, సారా జార్నుచ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Marcis Stoinis 😀pic.twitter.com/Q0wkEXbtLb
— CricketGully (@thecricketgully) October 2, 2025