Ind vs WI, 1st Test: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఆడి ఫుల్ బిజీగా ఉన్న టీమిండియా ఇప్పుడు టెస్టులకు సిద్ధమయితుంది. ఇప్పటికే 9 ఓసారి ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గెలిచిన టీమిండియా… రేపటి నుంచి వెస్టిండీస్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. యంగ్ డైనమిక్ కెప్టెన్ గిల్ సారాద్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించి జట్ల వివరాలు కూడా వెల్లడించారు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies, 1st Test ) మధ్య రేపటి నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్ట్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ టెస్ట్ ఇండియాలో జరగనున్న నేపథ్యంలో ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ ప్రక్రియ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఉంటుంది. టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ వద్దట్ల మధ్య జరగనున్న ఈ రెండు టెస్ట్ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ లో రానున్నాయి. మొన్నటి వరకు ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సోనీ ఛానల్ లో వచ్చింది. కానీ ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ మాత్రం స్టార్ స్పోర్ట్స్ లో రానుంది. దాదాపు మూడు భాషల్లో ఈ సిరీస్… ప్రసారమవుతుంది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. అక్టోబర్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ఆరవ తేదీ వరకు ఈ తొలి టెస్ట్ జరగనుంది. అలాగే అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు రెండవ టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా అరుణ్ జెట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
వెస్టిండీస్ అలాగే టీమిండియా మధ్య రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… ఇందులో వెస్టిండీస్ కు అడ్వాంటేజ్ ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 100 టెస్టులు జరిగాయి. ఇందులో టీమిండియా 23 మ్యాచ్లలో విజయం సాధించింది. వెస్టిండీస్ 30 మ్యాచ్ల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 47 మ్యాచ్లు డ్రాగ ముగిశాయి.
భారత్ ఆడుతున్న 11 : యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (C), ధ్రువ్ జురెల్ (Keeper), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ ఆడుతున్న 11: అలిక్ అథానాజ్, టాగెనరైన్ చందర్‌పాల్, కెవ్లాన్ అండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్ (c), షాయ్ హోప్, జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికాన్ (Keeper), జెడియా బ్లేడ్స్, ఖరీ పియరీ, జేడెన్ సీల్స్