Raju Gari gadhi 4: రాజు గారి గది.. ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ సీరీస్ లో భాగంగా ఇప్పుడు నాల్గవ భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హారర్ కామెడీ జానర్ ను మరో కొత్త స్థాయికి తీసుకెళ్తూ మేకర్స్ దసరా సందర్భంగా ఒక అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తున్న ‘ రాజు గారి గది 4: శ్రీ చక్రం’ సినిమా వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఓంకార్ (Omkar) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇకపోతే ఇటీవలే మిరాయ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ సినిమా రాబోతుండడంతో ఇప్పుడు అంచనాలు మరింత పెరిగిపోయాయి.
భయపెడుతున్న పోస్టర్..
తాజాగా దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్లో ఎరుపు రంగు చీర కట్టుకున్న ఒక మహిళ గాల్లో తేలుతూ కనిపించగా.. ఆమె ముందు శక్తివంతమైన కాళీమాత విగ్రహం కనిపిస్తోంది. ఈ దృశ్యం సినిమా ఆధ్యాత్మిక అతీత శక్తుల నేపథ్యంలో ఉంటుందని స్పష్టం అవుతోంది. పైగా ఈ చిత్రానికి “ఏ డివైన్ హారర్ బిగిన్స్” అంటూ ట్యాగ్ లైన్ జోడించడంతో సినిమాలోని భయానక అంశాలను తెలియజేస్తోందని చెప్పవచ్చు. మొత్తానికైతే భయపడడానికి సిద్ధం కండి.. అంటూ ఒళ్ళు గగుర్పొడిచే పోస్టర్ తో సినిమా అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా రాజు గారి గది సీరీస్ లోనే ది బెస్ట్ అవుతుందని.. పోస్టర్ తోనే అర్థమవుతుందంటూ సినిమా లవర్స్ కామెంట్లు చేస్తున్నారు.
రాజు గారి గది 4 సినిమా విశేషాలు..
ఈ సినిమా విశేషానికి వస్తే.. ఓంకార్ మార్క్ కథనం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఎస్.తమన్ సంగీతం అందిస్తూ ఉండగా.. శ్రీచక్రం కథ కాళికాపురం అనే గ్రామంలో జరుగుతున్నట్లు సమాచారం. కేవలం దెయ్యాల కథ మాత్రమే కాకుండా పురాతన విశ్వాసాలు, భయాలు, ఆత్మల చుట్టూ అల్లుకున్న ఒక ఆధ్యాత్మిక హారర్ తో కూడిన కామెడీ సినిమాగా ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఏది ఏమైనా తాజాగా కొత్త సీరీస్ ని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
also read:Bigg Boss 9 Promo: హిప్పో ఆకలి తీరేనా.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం!
రాజు గారి గది సినిమా సీరీస్..
రాజు గారి గది సినిమా సీరీస్ విషయానికి వస్తే.. 2015 అక్టోబర్ 16న భయానక తెలుగు హాస్య చిత్రం రాజు గారి గది చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రంలో అశ్విన్ బాబు, ధన్య బాలకృష్ణన్ నటించగా.. సాయి కార్తిక సంగీతం అందించారు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. దీనికి సీక్వెల్ గా 2017లో రాజు గారి గది 2, 2019లో రాజు గారి గది 3 చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు నాల్గవ సిరీస్ ని కూడా ప్రకటించారు.. మరి ఈ సీరీస్ తో అటు మేకర్స్ ఇటు డైరెక్టర్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
When devotion breaks…her wrath awakens 🔥
On this auspicious Vijayadashami, the horror saga that shook Telugu cinema is back ❤️🔥#RajuGariGadhi4 – SRI CHAKRAM 💥
The shoot begins soon… the fear begins sooner 😱#HappyDussehra 🔱@Withloveohmkar @vishwaprasadtg #KrithiPrasad… pic.twitter.com/BVoRF78ViB
— People Media Factory (@peoplemediafcy) October 2, 2025