SRH VS CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (MA Chidambaram Stadium, Chennai) వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ లోకి దూసుకు వెళ్తుంది. అటు గుజరాత్ టైటాన్స్ కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ప్లే ఆఫ్స్ కు చేరే చాన్స్ ఉంది.
సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ వేదికల్లో ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. ఇలాంటి క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో 70 శాతం వర్షం పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో 35% వర్షపాతం ఉండనుందట. అదే మ్యాచ్ ప్రారంభమయ్య సమయానికి వర్షపాతం పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే వర్షం భారీగా పడితే మాత్రం మ్యాచ్ రద్దు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక మధ్యలో వర్షం ఆగిపోతే, ఓవర్లను కుదించి మరి మ్యాచ్ నిర్వహిస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ అదృష్టం బాగా లేకపోతే… మ్యాచ్ పూర్తిగా రద్దయ్య ప్రమాదాలు కూడా ఉంటాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే ఇవాల్టి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే 15 పాయింట్లు హైదరాబాద్ ఖాతాలోకి వస్తాయి. అప్పుడు తన మిగిలిన బెంగుళూరు మ్యాచ్ తో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఛాన్సులు ఉంటాయి. ఒకవేళ బెంగళూరు చేతిలో ఓడిపోయినా, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.
అటు ఈ మ్యాచ్ రద్దు అయితే హైదరాబాద్ కంటే చెన్నై సూపర్ కింగ్స్ కు అత్యంత ప్రమాదం జరగనుంది. మ్యాచ్ రద్దు అయితే చెన్నై సూపర్ కింగ్స్ 13 పాయింట్స్ కు చేరుకుంటుంది. అంటే తన తర్వాతి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించినా కూడా ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. రాజస్థాన్ రాయల్స్ తమ మిగిలిన మ్యాచుల్లో ఓడిపోవాలి. అటు పంజాబ్ కింగ్స్ కూడా ఎప్పటిలాగే తన చివరి మ్యాచ్ లో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే చెన్నైకి ఛాన్స్ ఉంటుంది. ఈ లెక్కన సన్ రైజర్స్, చెన్నై, గుజరాత్, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ బరిలో ఉంటాయన్న మాట.
SCENARIO FOR TONIGHT'S GAME :
– CSK wins then will enter in top 4 in points table and chances will be over 50% for playoffs.
– SRH wins will guarantee their spots in playoffs alongside GT.Must win game for Chennai Super Kings tonight against SRH. pic.twitter.com/Xldur8qv5F
— Maina Singh (@Maina_Singhx77) May 18, 2026