E-Paper
Advertisement

IND vs ENG 2024 : గవాస్కర్ చెప్పినట్టు.. ఇంగ్లాండ్ ది అదే వ్యూహమా?

IND vs ENG 2024 : గవాస్కర్ చెప్పినట్టు.. ఇంగ్లాండ్ ది అదే వ్యూహమా?
Advertisement
 IND vs ENG 2024

IND vs ENG 2024 : అది టెస్ట్ మ్యాచ్ కానివ్వండి, వన్డే కానివ్వండి, టీ 20 కానివ్వండి, ఒకటే దెబ్బ, బాల్ ని ఎత్తి కొడితే సిక్స్ లేదా ఫోర్ రావాలి. అంటే దూకుడైన ఆటతీరుతో టెస్ట్ మ్యాచ్ ల స్వరూపాన్నే మార్చివేస్తూ, బజ్ బాల్ వ్యూహంతో ఇంగ్లాండ్ వరుస విజయాలు సాధిస్తోంది.

ఇదే విషయాన్ని సీనియర్ ఆటగాడు సునీల్ గవాస్కర్ చెబుతూ ఇంగ్లాండ్ అదే వ్యూహంతో వస్తే, మనవాడు విరాట్ కొహ్లీ ఒక్కడు చాలని అన్నాడు. అతనన్న ఒక్కరోజులోనే కొహ్లీ రెండు టెస్ట్ మ్యాచ్ లకి సెలవు పెట్టేశాడు.

Advertisement

అయితే కంగారు పడాల్సిన పనిలేదని అంటున్నారు. ఎందుకంటే అలాంటి దూకుడైన గేమ్ తో ఇంగ్లాండ్ వస్తుందని తెలిసే, టీ 20 ప్లేయర్లని కొందరిని తీసుకున్నారని చెబుతున్నారు. రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ లాంటివాళ్లున్నారని అంటున్నారు. అలాగే మూడో టెస్ట్ మ్యాచ్ కి రింకూ సింగ్, తిలక్ వర్మ కూడా వచ్చేలా ఉన్నారు. ఎందుకైనా మంచిదని వీరిద్దరినీ ఇంగ్లాండ్ లయన్స్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లకి ఎంపిక చేశారు.

ఇండియా వచ్చే ముందే అబుదాబీలో 11 రోజుల పాటు స్పిన్ పిచ్ ల మీద తీవ్రంగా సాధన చేసిన ఇంగ్లీషు జట్టు, మరి జనవరి 25న హైదరాబాద్ లో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ లో ఎటువంటి ప్రదర్శన చూపిస్తోందో, దానిని టీమ్ ఇండియా ఎలా బదులిస్తుందో వేచి చూడాల్సిందే.

Advertisement

తొలి రెండు టెస్టులకు ఎంపికైన టీమిండియా : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్

ఇంగ్లాండ్ జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్

Related News

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

వైభ‌వ్ ఓవ‌రాక్ష‌న్‌..మ్యాచ్ మ‌ధ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌కు స్ట్రాంగ్ వార్నింగ్

లైవ్ మ్యాచ్ లో బ‌రితెగించిన పాక్ ఫ్యాన్స్‌…”క్రాంతి గౌడ్” మ‌గాడంటూ కేక‌లు !

55 ప‌రుగుల‌కే ఆలౌటైనా సిగ్గు రాలేదా? ఫాతిమా స‌నా ఓవ‌రాక్ష‌న్‌పై టీమిండియా క్రికెట‌ర్ సీరియ‌స్

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

55 ప‌రుగుల‌కే పాకిస్తాన్ ఆలౌట్…ఫాతిమా స‌నా పాత వీడియో వైర‌ల్

PCBలో ఆర్థిక సంక్షోభం.. PSL ఆడే ప్లేయ‌ర్ల జీతాలు భారీగా త‌గ్గింపు ?

Big Stories

Advertisement
×