BigTV English

Cricket Betting:- కోట్లలో టర్నోవర్.. క్రికెట్ బెట్టింగ్స్‌ ముఠాల బరితెగింపు

Cricket Betting:- కోట్లలో టర్నోవర్.. క్రికెట్ బెట్టింగ్స్‌ ముఠాల బరితెగింపు

Cricket Betting:- మ్యాచ్ ఏదైనా సరే బెట్టింగ్ కామన్. మొన్ననే ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి ఈ బెట్టింగ్ మోజులో పడి ఏకంగా వంద కోట్లు పోగొట్టుకున్నాడు. మొదట్లో లక్షలు రావడంతో.. ఇంకా వస్తాయన్న ఆశతో ఇంకా ఎక్కువ బెట్టింగ్ కాశాడు. ఓవైపు కోట్లు పోతున్నాయని తెలిసినా.. ఆ వ్యసనంలో పూర్తిగా కోల్పోయాడు. రియల్ ఎస్టేట్‌లో సంపాదించింది పోగొట్టుకోవడమే కాకుండా… అప్పులు చేసి మరీ చేతులు కాల్చుకున్నాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఒక్కడే వంద కోట్లు కోల్పోయాడంటే టోటల్ బెట్టింగ్స్‌లో ఎన్ని వందల కోట్లు కోల్పోయి ఉంటారు?


ఒక్క హైదరాబాద్‌లోనే క్రికెట్ బెట్టింగ్స్ టర్నోవరల్ కోట్లకు కోట్లు ఉంటుందని అంచనా. బెట్టింగ్ ముఠాలు లక్షలు సంపాదించవచ్చని ఆశపెట్టించి, వారిని ముగ్గులోకి దించి, ఉన్నది మొత్తం పోగొట్టుకునేలా చేస్తోంది. ఈ బెట్టింగుకు ఎంతగా బానిసలను చేస్తున్నారంటే.. ఓవైపు ఉన్నదంతా పోయినా సరే.. అప్పులు చేసి మరీ బెట్టింగులో పెట్టేంతగా.

హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో IPL క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో కోటి 41 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మొన్న ఉప్పల్ లో  ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా  పందెం రాయుళ్లు బరితెగించారు. రాజేంద్రనగర్ లోని మైలార్ దేవులపల్లి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు రైడ్స్ చేశారు. ఈ దాడిలో రూ. 46 లక్షలు సీజ్ చేశారు.


ఓవైపు పోలీసులు బెట్టింగ్ ముఠాలను అరెస్ట్ చేస్తున్నా సరే… హైదరాబాద్‌లోని ఏదో మూలన ఈ దందా జరుగుతూనే ఉంది. ఈ బిజినెస్ కోట్లలో జరుగుతుండడంతో.. ఆర్గనైజర్లు ప్లేసులు మార్చి మరీ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×