BigTV English

Kohli Likely to miss T20 World Cup 2024: విరాట్ కొహ్లీ టీ 20 ప్రపంచకప్ లో ఆడుతున్నాడా..? లేదా..?

Kohli Likely to miss T20 World Cup 2024: విరాట్ కొహ్లీ టీ 20 ప్రపంచకప్ లో ఆడుతున్నాడా..? లేదా..?

Virat Kohli - T20 World Cup 2024


Virat Kohli Likely to miss  T20 World Cup 2024: సామాజిక మాధ్యమాల్లో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తమ ఛానళ్ల రేటింగ్ కోసం లేనిపోని వార్తలను కల్పించి ప్రచారం చేస్తున్నాయి. వైరల్ అయ్యేలా చూస్తున్నాయి. ఈ క్రమంలో నెట్టింట ఒక వార్త రయ్ రయ్ మని వెళుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే విరాట్ కొహ్లీ టీ 20 ప్రపంచకప్ లో ఆడటం లేదు.. కుర్రాళ్ల కోసం త్యాగం చేస్తున్నాడని వార్తలు దుమ్ము రేపుతున్నాయి.

ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైదొలిగిన కొహ్లీ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నడని సమాాచారం. ఫ్రాంచైజీలు రెడీ అయిపోయాయి. అంతా హడావుడిగా ఉంది. ఈ సమయంలో ఆర్సీబీ అధికారిక సైట్ నుంచి కొహ్లీకి సంబంధించి..‘నువ్వే మా నమ్మకం’అంటూ ఒక కొటేషన్ బయటికి వచ్చింది.


తీరా ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ లేకపోతే వరల్డ్ కప్ టోర్నీకి క్రేజ్ తగ్గడం ఖాయమని అన్నాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్ పై విరాటుడి విశ్వరూపాన్ని ఎవరూ మరిచిపోలేరని గుర్తు చేశాడు. అలాంటివి విరాట్ బ్యాట్ నుంచి మరిన్ని రావాలి, అభిమానులు చూడాలి అని రాసుకొచ్చాడు.

Also Read: డబ్బుల కోసం కాదు.. దేశం కోసం ఆడాలి పాండ్యాపై మాజీ బౌలర్ ప్రవీణ్ బౌన్సర్లు..

అలాగే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు నిజమని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికొచ్చి కొహ్లీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. టీ 20 ప్రపంచకప్ లో విరాట్ ఆడాలి.. అందరిలాగే నేను కూడా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తానని అన్నాడు. క్రికెట్ క్రేజ్ కి నిలువెత్తు నిదర్శనమైన కొహ్లీ ప్రపంచకప్ జట్టులో ఉండాలని కోరుకుంటున్నాని తెలిపాడు.

ఇటీవలే అనుష్కశర్మ రెండో బిడ్డకు జన్మనిచ్చింది. మరోవైపు చాలారోజుల విరామం తర్వాత విరాట్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. తాజాగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ జట్టులో కలిశాడు.  దీంతో ఆర్సీబీ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెట్టింది. ఫాఫ్ వచ్చేశాడు…మేం తొలిపోరుకు సిద్ధం. అని రాసుకొచ్చారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×