E-Paper
Advertisement

Wimbledon 2024 Alcaraz win: వింబుల్డన్ టోర్నీ.. టాప్ సీడ్ ఆటగాళ్లు ముందంజ, సెకండ్ రౌండ్‌లో అల్కరాస్

Wimbledon 2024 Alcaraz win: వింబుల్డన్ టోర్నీ.. టాప్ సీడ్ ఆటగాళ్లు ముందంజ, సెకండ్ రౌండ్‌లో అల్కరాస్
Advertisement

Wimbledon 2024: Alcaraz win: లండన్ వేదికగా వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ ఆటగాళ్లు గెలుపొంది తర్వాత రౌండ్‌కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఫ్రెండ్ ఓపెన్ విన్నర్ కార్లోస్ అల్కరాస్ సెకండ్ రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.

సోమవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో మూడో సీడ్ ఆటగాడు అల్కరాస్.. లజల్ ఎన్తోనియాపై వరుస సెట్లలో విజయం సాధించాడు. తొలి రౌండ్ నుంచి ఇరువురు ఆటగాళ్లు మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. ఈ క్రమంలో తొలి రెండు సెట్లు టైబ్రేక్ దారి తీసింది. అందులో విజయం సాధించిన అల్కరాస్, మూడో సెట్లో ప్రత్యర్థి లజల్ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేకపోయాడు. దీంతో వరుస మూడు సెట్లను 7-6, 7-5, 6-2 తేడాతో గెలిచి తర్వాత రౌండ్‌కు అర్హత సాధించాడు.

Advertisement

తొలిరౌండ్‌లో రష్యాకు చెందిన మరో సీడ్ ఆటగాడు డేనియల్ మెద్విదేవ్ శుభారంభం చేశాడు. తొలిరౌండ్‌ లో సెర్బియాకు చెందిన అలెగ్జాండర్ కొవసెవిచ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. తొలి నుంచి ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదుకాకపోవడంతో మెద్విదేవ్ వరుస సెట్లను 6-3, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు.

Advertisement

మహిళల సింగిల్స్ విభాగంలో జపాన్ క్రీడాకారిణి ఒసాకా సెకండ్ రౌండ్లో అడుగుపెట్టింది. తొలిరౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన పారీపై సంచలన విజయం సాధించింది. తొలిసెట్‌ను సునాయాశంగా గెలుచుకున్న ఒసాకా, రెండ్ సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో మూడో సెట్ ఇరువురు క్రీడాకారుణుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోరు సాగింది. చివరకు ఒసాకాదే పైచేయి అయ్యింది. దీంతో మూడు సెట్లను 6-1, 1-6, 6-4 తో ఒసాకా గెలుపొందింది.

మరో మ్యాచ్‌లో గ్రీస్‌కు చెందిన తొమ్మిదో సీడ్ ప్లేయర్ సకారి శుభారంభం చేసింది. ఆమె 6-3, 6-1 తేడాతో అమెరికాకు చెందిన కెప్లెర్‌ను చిత్తు చేసింది.

Tags

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×