BigTV English

Allu Arjun Mama: కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్‌ మామ.. కండువాకప్పి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి..

Allu Arjun Mama: కాంగ్రెస్‌లోకి అల్లు అర్జున్‌ మామ.. కండువాకప్పి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి..
kancharla chandrasekhar reddy joins congress

Allu Arjun Mama joins Congress(Political news today telangana): లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌, ఆయన భార్య చర్లపల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్‌ శ్రీదేవి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.


గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప్‌దాస్‌ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పార్టీలో చేరిన నేతలంతా అసెంబ్లీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.త

చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నుంచి నాగార్జునసాగర్‌ టికెట్ ఆశించారు. తన గెలుపు కోసం బన్నీ ప్రచారం చేస్తాడని కూడా ఆయన ప్రకటించారు. కానీ, బీఆర్ఎస్ టికెట్‌ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు.


Tags

Related News

Falaknuma train: ట్రైన్‌లో ఉగ్రవాదులు.. ఘట్ కేసర్ స్టేషన్ లో నిలిపివేత, ముమ్మరంగా తనిఖీలు

CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. బీసీలకు 42% రిజర్వేషన్

Hyderabad News: బతుకమ్మకుంట ప్రారంభోత్సవం వాయిదా, మళ్లీ ఎప్పుడంటే..

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాలన్నీ జలమయం

Weather Alert: బలపడిన వాయుగుండం.. మరో మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. బయటకు రాకండి

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Big Stories

×