E-Paper
Advertisement

PM Modi Tour: మోదీకి నిరసన సెగ.. కాంగ్రెస్ నేతల అరెస్ట్.. బీఆర్ఎస్‌కు రెడ్ కార్పెట్..

PM Modi Tour: మోదీకి నిరసన సెగ.. కాంగ్రెస్ నేతల అరెస్ట్.. బీఆర్ఎస్‌కు రెడ్ కార్పెట్..
Advertisement
go back modi

PM Modi Tour: మోదీ హైదరాబాద్ వస్తున్నారు. ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ హెచ్చరించింది. నల్ల బెలూన్లతో నిరసన చెప్పేందుకు సిద్ధమవుతోంది యూత్ కాంగ్రెస్. పోలీసులు ఉలిక్కపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా.. పలువురు కాంగ్రెస్ లీడర్లను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, NSUI అధ్యక్షులు బలమూరి వెంకట్, దళిత కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతమ్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు తదితరులను ముందస్తు అరెస్ట్ చేశారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టులపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఇదేమీ పోలీస్ రాజ్యం అంటూ తప్పుబడుతోంది.

Advertisement

అయితే, బీఆర్ఎస్ ఆందోళనలకు మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకపోవడం ఆసక్తికరం. సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు పిలుపుఇచ్చింది బీఆర్ఎస్. ఇప్పటికే మోదీ టార్గెట్‌గా హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో సెగ తగిలింది. సింగరేణి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నారు. మోదీ, బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. వామపక్షాలు సైతం గులాబీ శ్రేణులకు జత కలవడంతో.. ప్రధానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసన హోరెత్తుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుపై బీజేపీ మండిపడుతోంది.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×