E-Paper
Advertisement

CM Revanth Reddy: సౌత్ టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణ.. భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్న సీఎం రేవంత్

CM Revanth Reddy: సౌత్  టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణ.. భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్న సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy: దక్షిణాసియా టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. పెట్టుబడుదారులకు కావల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అత్యుత్తమ ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్‌కు గొప్ప చరిత్ర ఉందన్నారు. టెక్స్‌టైల్స్ కేవలం పరిశ్రమ కాదని, చేనేతలకు జీవితమన్నారు.

సౌత్ టెక్స్‌టైల్స్ క్యాపిటల్‌గా తెలంగాణ.. ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి

Advertisement

శుక్రవారం హైటెక్స్‌లో ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్-2026 కాన్ఫరెన్స్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, టెక్స్‌టైల్స్ పరిశ్రమ ప్ర‌ముఖులకు తెలంగాణ‌, హైద‌రాబాద్‌కు స్వాగ‌తం ప‌లుకుతోందన్నారు. మీరు కేవలం అతిథులు మాత్రమే కాదు, మా అభివృద్ధి భాగస్వాములు, మా విజన్‌ను పంచుకునే స్నేహితులని అన్నారు. టెక్స్‌టైల్స్ అనేది మ‌న‌ DNA లో ఉందన్నారు.

టెక్స్ టైల్స్ రంగంలో మాకు ఒక విజ‌న్ ఉందన్నారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలో టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు.  నిజాం కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు హైదరాబాద్‌కు వచ్చి వస్త్రాలు, ముత్యాలు కొనుగోలు చేసేవారని వివరించారు.

Advertisement

పెట్టుబడులు పెట్టేవారికి మా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, భూమి, విద్యుత్, నీరు, ప్రోత్సాహకాల‌తోపాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. ప్రపంచానికి సరితూగే విధానాలు మా వద్ద ఉన్నాయన్నారు. అత్యుత్తమ మానవ వనరులు మా బలమన్నారు. విజన్ ఉంటే.. మేము మీకు సరైన భాగస్వాములమని, అంతా కలిసి ప్రపంచాన్ని మార్చగల టెక్స్టైల్ ఎకో సిస్టమ్‌ను నిర్మిద్దామన్నారు.

అత్యుత్తమ ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్‌కు గొప్ప చరిత్ర- సీఎం రేవంత్

ప్రసిద్ధి చెందిన పోచంపల్లి, గద్వాల్ చీరలు, నారాయణపేట చేనేత వరకు ఇక్కడ అనేకం ఉన్నాయన్నారు. తెలంగాణ టెక్స్‌టైల్స్ రంగంలో ముందంజలో ఉండటానికి చారిత్రక కారణాలు ఉన్నాయన్నారు. దేశంలో పత్తి ఉత్పత్తిలో తాము అగ్రగామిగా ఉన్నామని, పత్తి నాణ్యతలో ప్రపంచవ్యాప్తంగా పేరుందన్నారు.

వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో అనేక రంగాల పార్కులు ఉన్నాయన్నారు. తెలంగాణలో నైపుణ్యం కూడా ఉందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. డీప్ టెక్ , ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్ ,డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ అనేక రంగాల్లో ముందంజ‌లో ఉన్నామని గుర్తు చేశారు.

తెలంగాణ పత్తి.. పొలాల నుండి లండన్, న్యూయార్క్, పారిస్, మిలాన్, టోక్యో, దుబాయ్ ఫ్యాషన్ షోల వరకు అనేక అంశాల్లో మేము క‌లిసి ప‌ని చేస్తున్నామని, హైదరాబాద్ దేశానికి మాత్రమే కాదు, ప్రపంచ సినిమా నిర్మాణ రంగానికి కేంద్రంగా ఎదుగుతోందన్నారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోలను ఇక్కడ ప్రారంభించాయని వివరించారు.

ALSO READ: “సారీ నాన్నా.. నన్ను వెతకకండి”.. కూకట్‌పల్లిలో రూ. 25 లక్షల సొమ్ముతో బాలుడు పరార్

టాలీవుడ్, బాలీవుడ్ ఇప్పటికే హైదరాబాద్‌ను తమ కేంద్రంగా ఉపయోగిస్తున్నాయని, ఇప్పుడు హాలీవుడ్ కూడా చేరిందన్నారు. సినిమా రంగం తమ ఫ్యాషన్‌ను తెలంగాణ నుంచి పొందేలా ప్రోత్సహిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ మా అత్యున్నత ప్రాధాన్యమని చెబుతూనే, గ్రీన్ టెక్స్టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి. యువతకు, ముఖ్యంగా మహిళలకు, శిక్షణ అందిస్తామన్నారు.

సంప్రదాయ ఆలోచ‌న‌లు ఆధునిక టూల్స్‌తో కలిపి డిజైన్, కట్టింగ్, స్టిచింగ్‌లో ఉపయోగించేలా చేస్తామన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు, ఔషధాలు అందించిన రాష్ట్ర తెలంగాణ అని తెలియజేశారు. ఆపిల్ ఇయర్‌పాడ్స్ ఇక్కడే తయారవుతున్నాయని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించేలా చేయాలని మా లక్ష్యంమన్నారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగ‌స్వాములు కావాలని కోరారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడమే మా లక్ష్యమన్నారు. శ్రీ రామనవమి సందర్భంగా మా సంప్రదాయం ప్రకారం తెలంగాణ ముఖ్య‌మంత్రి హోదాలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి పవిత్ర వస్త్రాలను సమర్పించడం తనకు గౌరవంగా ఉందన్నారు.

 

Related News

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

Big Stories

Advertisement
×