BigTV English
Advertisement

Hanuman Shobha Yatra Tension: హనుమాన్ ర్యాలీలో ఉద్రిక్తత.. కత్తితో వ్యక్తి హంగామా.. పోలీసు వాహనం డ్యామేజ్!

Hanuman Shobha Yatra Tension: హనుమాన్ ర్యాలీలో ఉద్రిక్తత.. కత్తితో వ్యక్తి హంగామా.. పోలీసు వాహనం డ్యామేజ్!

High Tension Hanuman Shobha Yatra in Karimnagar: కరీంనగర్ జిల్లా మంచిర్యాల టౌన్ జంక్షన్‌లో చేపట్టిన హనుమాన్ శోభాయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. యాత్రలోకి ఓ వ్యక్తి కత్తితో ప్రవేశించి గందరగోళం సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అతడ్ని అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని తమకు అప్పగించాలని హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసు పెట్రోలింగ్ వాహనంపై దాడి చేశారు. పరిస్థితి గమనించిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసలేం జరిగిందంటే..


కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ నుంచి గాంధీ రోడ్‌లోని ఆంజనేయ దేవాలయం వరకు శోభాయత్ర ప్రారంభించారు హనుమాన్ భక్తులు. ప్రశాంతంగా జరుగుతున్న ర్యాలీలో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రవేశించాడు. అంతేకాదు డ్యాన్సులు చేయడం మొదలుపెట్టాడు. అతడ్ని హనుమాన్ భక్తులు అడ్డుకున్నారు. దీంతో ఆ యువకుడు- హనుమాన్ భక్తుల మధ్య వాగ్వాదానికి చోటు చేసుకుంది. ఘర్షణ జరుగుతున్న సమయంలో పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

యవకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించే ప్రయత్నంలో హనుమాన్ భక్తులు పోలీసు వాహనాన్ని వెంబడించారు. ఓ భక్తుడు వాహనం పట్టుకుని వేలాడాడు. కొద్దిదూరం వెళ్లాక పోలీసులు వాహనాన్ని ఆపారు. కోపోద్రిక్తులపై ఆంజనేయ భక్తులు పోలీసు వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. చివరకు యువకుడ్ని స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే బీజేపీ నాయకులు మూడో నెంబర్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎట్టకేలకు పరిస్థితి సద్దుమణిగింది.


Also Read: రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి.. అధికారులను ఆదేశించిన సీఎం

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×