E-Paper
Advertisement

Telangana rains : మరో 3 రోజులపాటు అతి భారీ వర్షాలు.. తెలంగాణలో రెడ్ అలెర్ట్..

Telangana rains : మరో 3 రోజులపాటు అతి భారీ వర్షాలు.. తెలంగాణలో రెడ్ అలెర్ట్..
Advertisement
Rain news today telangana

Rain news today telangana(Telugu flash news): తెలంగాణకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరో 3 రోజులపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో‌‌‌‌ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

భారీగా కురిసిన వర్షానికి హైదరాబాద్ మరోసారి వణికిపోయింది. రహదారులు జలమయమయ్యాయి. సోమవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి నగర వాసులు అల్లాడిపోయారు. బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు చేరుకున్నారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ సమ్యలు తలెత్తాయి.

Advertisement

నగరంలో నాలాలు, మ్యాన్‌హోల్‌లు పొంగిపొర్లుతున్నాయి. నాలాల సామర్థ్యం కన్నా రెట్టింపు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఉన్న నాలాలకు గంటకు 2 సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకునే శక్తి ఉంది. అయితే అంతకుమించి వాన కురవడంతో నగరంలోని రహదారులు చెరువుల్లా మారాయి.

రోడ్లపై భారీగా నీరు నిలిచి ఇళ్లలోకి వస్తుండటంతో పలుచోట్ల మ్యాన్‌‌‌‌హోళ్ల మూతలు తెరిచారు. ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లన్నీ మోకాళ్ల లోతు వరకు నీళ్లతో నిండిపోయాయి.

Advertisement

సోమవారం సాయంత్రం మియాపూర్‌లో అరగంట వ్యవధిలోనే 3.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్‌ జిల్లా సంగెంలో 9 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 8.4 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో 7.7 సెంటీమీటర్లు, హైదరాబాద్‌ శివరాంపల్లిలో 6.48 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 6.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×