E-Paper
Advertisement

IMD Update: తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు.. ఐఎండీ సూచనలివే

IMD Update: తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు.. ఐఎండీ సూచనలివే
Advertisement

Rain alert in Telangana & AP(Today weather report telugu): వచ్చే ఐదు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. దీని ఫలితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.

మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం బుధవారం బలహీనపడింది. ఈ అల్పపీడన ప్రభావంతో కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ సూచించింది.

Advertisement

మంగళవారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. కొమురంభీం అసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో వర్షం భారీగా పడింది. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read: ధోతీ ధరించాడని మాల్‌లోకి రానివ్వని సెక్యూరిటీ సిబ్బంది

Advertisement

తెలంగాణలో బుధవారం రోజున ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో కూడా ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ జిల్లాల్లోనూ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.

హైదరాబాద్‌లో వచ్చే రెండు రోజుల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నది.

Tags

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×