E-Paper
Advertisement

APK File Scam: మీకు ఈ మెసేజ్ వచ్చిందా? వెంటనే 15531కు కాల్ చేయండి

APK File Scam: మీకు ఈ మెసేజ్ వచ్చిందా? వెంటనే 15531కు కాల్ చేయండి
Advertisement

APK File Scam: కొంద‌రు అజ్ఞాత వ్య‌క్తులు గుర్తు తెలియ‌ని మొబైల్‌ నెంబ‌ర్ల‌నుంచి.. జ‌ల‌మండ‌లి న‌ల్లాబిల్లు చెల్లించ‌కుంటే క‌నెక్ష‌న్ తొల‌గిస్తామ‌ని, తప్పుడు స‌మాచారాన్ని వినియోగ‌దారుల‌కు SMS ద్వారా చేర‌వేస్తున్నార‌ని జ‌ల‌మండ‌లి దృష్టికి వ‌చ్చింది. అలాంటి మెసేజ్‌ల‌కు స్పందించ‌కూడ‌దని జ‌ల‌మండ‌లి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

ప్రజలు ఆ నంబర్‌కు కాల్ చేస్తే, అటువైపు ఉన్న వ్యక్తులు ప్రాసెసింగ్ కోసం ఒక APK యాప్ పంపిస్తాం.. దాన్ని ఇన్‌స్టాల్ చేయండి అంటూ మోసపూరిత అప్‌డేట్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసిన పక్షంలో వినియోగదారుల ఫోన్ పూర్తిగా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ వివరాలు, OTPలు వరకు సైబర్ నేరగాళ్లకు చేరే అవకాశం ఉంది.

Advertisement

జలమండలి అధికారులకు ఈ విషయం తెలియడంతో వెంటనే సమగ్ర పరిశీలన ప్రారంభించారు. వారు ప్రజలకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

జలమండలి ఎటువంటి నకిలీ సందేశాలు పంపదు. APK ఫైళ్లను పంపడం మా వ్యవస్థలో ఉండదు. ఇటువంటి మెసేజ్‌లు పూర్తిగా మోసపూరితమైనవి. ఎవ్వరూ స్పందించకండి అని అధికారుల ప్రకటన.

Advertisement

జ‌ల‌మండ‌లి నుంచి అన్ని అధికారిక‌ స‌మాచారాలు కేవ‌లం అధికారిక‌ మార్గాల (అన్నీ పేప‌ర్లు, వివిధ టీవీ చానెల్‌లు) ద్వారా జారీ చేస్తుంది. ఈ విష‌య‌మైనా.. ఏవైనా స‌మ‌స్య‌లు లేదా సేవా సంబంధిత సందేహాలు ఉంటే జ‌ల‌మండ‌లి క‌స్ట‌మ‌ర్ కేర్ 155313కి సంప్ర‌దించాల‌ని కోరుతుంది.

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డబ్బుతో సంబంధమున్న ఏ సందేశం వచ్చినా వెంటనే స్పందించకండి. రెండుసార్లు ధృవీకరించండి. నేరుగా అధికారిక కస్టమర్ కేర్‌నే సంప్రదించండి అని జలమండలి విజ్ఞప్తి చేసింది.

Also Read: పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

ప్రజలు జాగ్రత్తగా ఉంటేనే ఈ మోసగాళ్ల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. జలమండలి స్పష్టమైన హెచ్చరికతో ప్రజల్లో అప్రమత్తత పెరుగుతోందని అధికారులు తెలిపారు.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×