BigTV English

KCR: అదును చూసి దెబ్బ.. బీజేపీకి తిరిగిన దిమ్మ.. అట్లుంటది కేసీఆర్‌తోని..

KCR: అదును చూసి దెబ్బ.. బీజేపీకి తిరిగిన దిమ్మ.. అట్లుంటది కేసీఆర్‌తోని..
bandi sanjay kcr

KCR: కేసీఆర్ మామూలోడు కాదు. తెలంగాణ చాణక్యుడనే పేరు ఊరికే రాలేదు. అసలేమైనా అటాకా ఇది. ఎక్కడి టెన్త్ పేపర్ లీక్. ఇంకెక్కడి ఎంపీ బండి సంజయ్ అరెస్ట్. అదును కోసం ఎదురుచూస్తున్న గులాబీ బాస్ కొట్టిన దెబ్బకు బీజేపీకి దిమ్మతిరిగిపోయింది. మైండ్ బ్లాంక్ అయి ఏం చేయాలో తెలీకుండా పోయింది. ఏకంగా మోదీ, షా, నడ్డాలే అర్జెంట్ మీటింగ్ పెట్టుకొని.. బీజేపీ నేతలకు డైరెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. అట్లుంటది కేసీఆర్‌తోని.


ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనే బీజేపీ పెద్దలను ఇరికిద్దామని చూశారు. కానీ, కోర్టు తీర్పులతో జస్ట్ మిస్డ్. ఈలోగా కేంద్రం నుంచి కౌంటర్ యాక్షన్ సీరియస్‌గా వచ్చింది. మంత్రులపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు. నోరెళ్లబెట్టి చూస్తుండగానే.. నేరుగా కవితపైనే కేసులు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఫుల్‌గా కార్నర్ చేశారు. అరెస్ట్ తప్పదనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్‌లో ఏదో జరిగినట్టుంది. వరుస విచారణలతోనే సరిపెట్టింది ఈడీ.

కూతురు సేఫ్ అని అనుకున్నారో ఏమో.. బీజేపీకి రిటర్న్ గిఫ్ట్‌ ఇచ్చేందుకు సరైన సమయం కోసం ఎదురుచూశారు కేసీఆర్. అనుకోకుండా టెన్త్ పేపర్ లీక్‌ కేసులో బండి సంజయ్ చిక్కారు. లీక్ జరిగిన కొన్నిగంటల్లోనే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారంటే గులాబీ బాస్ ఎంత వేగంగా పావులు కదిపుంటారో అర్థం అవుతోంది.


అర్థరాత్రి అని చూడకుండా.. అత్తారింట్లో ఉన్నారని ఆగకుండా.. ఉన్నవారిని ఉన్నట్టుగానే ఎత్తుకొచ్చేశారు పోలీసులు. మూడు నాలుగు జిల్లాలు తిప్పుతూ.. ముప్పుతిప్పలు పెట్టారు. బండి సంజయ్ అరెస్ట్ కంటే.. ఆయన అరెస్ట్ తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలే బీజేపీకి మింగుడు పడటం లేదు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు కమలనాథులు.

గులాబీ బాస్ ఇంతగా తమను హర్ట్ చేస్తే.. బీజేపీ పెద్దలు చూస్తూ ఊరుకుంటారా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటారా? ఆ గిఫ్ట్ కవిత రూపంలోనే ఉంటుందా? మరి, బీజేపీ యాక్షన్‌కు కేసీఆర్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారు? అసలు రాజకీయం ముందుందా? ఇంకాఉందా?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×