BigTV English

Congress: కాంగ్రెస్‌లోకి రాహుల్ సిప్లిగంజ్?.. అక్కడి నుంచే పోటీ? అందుకే, కేసీఆర్ పెండింగ్?

Congress: కాంగ్రెస్‌లోకి రాహుల్ సిప్లిగంజ్?.. అక్కడి నుంచే పోటీ? అందుకే, కేసీఆర్ పెండింగ్?
revanth reddy rahul sipligunj

Congress: బిగ్‌బాస్ విన్నర్, ఆస్కార్ పర్ఫార్మర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి హస్తం పార్టీ దరఖాస్తులు తీసుకుంటుండగా.. రాహుల్ సిప్లిగంజ్ సైతం ఓ అప్లికేషన్ వేశారని అంటున్నారు. గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారట రాహుల్.


గతంలో రాహుల్ సిప్లిగంజ్ అదే ప్రాంతంలో ఉండేవారు. ఇప్పటికీ వాళ్ల ఫ్యామిలీ సెలూన్ నాంపల్లిలోనే ఉంది. ఈ బిగ్‌బాస్ విన్నర్‌కు యూత్‌లో మంచి పేరుంది. ఫుల్‌గా మాస్ ఫాలోయింగ్ ఉండటం అదనపు అడ్వాంటేజ్. ఈ విషయం గుర్తించే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అడ్డాగా ఉన్న గోషామహల్ నుంచి రాహుల్ సిప్లిగంజ్‌ను బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట.

ముందుగా హస్తం పార్టీయే ఆయనతో టచ్‌లోకి వెళ్లిందని.. అంతా ఓకే అనుకున్నాకే.. రాహుల్ గోషామహల్ కాంగ్రెస్ సీటుకు దరఖాస్తు వేశారని చెబుతున్నారు. గోషామహల్ నుంచి రాహుల్ సిప్లిగంజ్ ఎంట్రీ ఇస్తారనే మేటర్‌ను.. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సీఎం కేసీఆర్‌కు సైతం ముందస్తు సమాచారం అందిందని అంటున్నారు. అందుకే, గోషామహల్ బీఆర్ఎస్ టికెట్‌ను పెండింగ్‌లో పెట్టారని భావిస్తున్నారు. ఇటు, రాజాసింగ్.. అటు రాహుల్ సిప్లిగంజ్.. వీరికి ధీటుగా ఫేమ్ ఉన్న కేండిడేట్‌ కోసం గులాబీ బాస్ తెగ సెర్చ్ చేస్తున్నారట.


సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, పోటీ చేయడం నిజమైతే.. ఈసారి తెలంగాణలో హాట్ సెగ్మెంట్ గోషామహలే కాబోతోందని అంటున్నారు. ఏమో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేగా!

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×