E-Paper
Advertisement

Revanth Reddy : కోమటిరెడ్డితో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. పార్టీలో చేరికలపై చర్చ..

Revanth Reddy : కోమటిరెడ్డితో రేవంత్ రెడ్డి కీలక భేటీ.. పార్టీలో చేరికలపై చర్చ..
Advertisement

Revanth Reddy latest news(Telangana congress news today): తెలంగాణలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ లో చేరేందుకు చాలామంది నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఇరువురు నేతలు పార్టీలో చేరికలపై చర్చించారు. కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

Advertisement

చేరికలపై ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చాలామంది పార్టీలో చేరతామని వస్తున్నారని తెలిపారు. వివాదాస్పదంగా చేరికలు ఉండవని స్పష్టంచేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డితో చర్చించిన తర్వాతే పార్టీలో నేతలను చేర్చుకుంటామన్నారు. రాహుల్ ను ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు.

రేవంత్ తాను కలిసి పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రేవంత్ తాను సోదురులుగా ఉంటామని తెలిపారు. ఆ తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి రేవంత్, కోమటిరెడ్డి వెళ్లారు. అక్కడే లంచ్ మీటింగ్ జరిగింది. జూపల్లిని కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

Advertisement

బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం నెలకొల్పడమే లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన సాగిస్తోందని జూపల్లి విమర్శించారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×