E-Paper
Advertisement

Teenmar Mallanna: సజ్జనార్ నీ దందాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది.. తీన్మార్ మల్లన్న మాస్ వార్నింగ్

Teenmar Mallanna: సజ్జనార్ నీ దందాల చిట్టా మొత్తం నా దగ్గర ఉంది.. తీన్మార్ మల్లన్న మాస్ వార్నింగ్
Advertisement

Teenmar Mallanna: గత కొన్ని సంవత్సరాలుగా సినిమా రంగానికి కంటి మీద కునుకులేకుండా చేసిన.. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా.. ఐబొమ్మ రవి ఎపిసోడ్ కాస్త పోలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై ఆయన చేసిన కామెంట్స్  పెద్ద దుమారమే రేపాయి. దీనిపై సోషల్ మీడియాలో సజ్జనార్ అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు.

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత  సీపీ సజ్జనార్ సినిమా వాళ్లతో మీడియా సమావేశం  ఏర్పాటు చేయడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రూపాలయ టికెట్‌ను వేలల్లో అమ్ముకుంటు వాళ్లు ఏమన్నా సంసారులా అంటూ ఫైర్ అయ్యారు.  అంతేకాదు..  నిన్ను చూసి నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కావట్లేదని సీపీ సజ్జనార్ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.

Advertisement

తమకు సవాల్ విసిరితే ఏమౌతుందో అనిమూవీ వాళ్లను పక్కన పెట్టుకుని.. సినిమా డైలాగ్ లు కొట్టడం కాదు.. దేశంలో ప్రతి ని‌మషానికి చిన్న పిల్లల్ని కిడ్నాప్‌లు చేస్తున్నారని, ఐబొమ్మ రవి భార్య పట్టించకపోతే.. మీరు అతడిని కనిపెట్టగలరా? సైబర్ క్రైమ్‌లో ట్రేస్ అవుట్ కానీ కేసులు చాలా ఉన్నాయి. దమ్ముంటే వాటిని ట్రేస్ చేయండి. ఎన్నడైనా నిజాయితీగా ఎన్ కౌంటర్ చేశావా ? సినిమా వాళ్లేమైనా సంసారులా.. దోపీడీ దొంగలను పక్కన కూర్చోబెట్టుకున్నావ్ అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అంతే కాదు ఐబొమ్మ మోసాలు ఆగవని.. ఇవి కొత్త కొత్త మార్గాల్లో మోసాలు జరుగుతునే ఉంటాయని సీపీ ఆనంద్ సైతం చెప్పారని తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు.  లొట్టపీస్ ఛాలెంజ్‌లు వేయడం మానేసి.. దమ్ముంటే సైబర్  క్రైమ్ మోసాలను ఆపే పనుల్ని చేయాలని కూడా తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Advertisement

ఇక తీన్మార్ మల్లన్న తాజాగా చేసిన వ్యాఖ్యలపై పలువురు ఖండిస్తున్నారు. పోలీసు శాఖను అగౌరవపర్చే విధంగా మల్లన్న మాట్లాడారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

https://www.instagram.com/mr_shekar_munna/?utm_source=ig_embed&ig_rid=00d924ea-34ad-45e4-949c-aa8e18e831db

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×