E-Paper
Advertisement

Congress: కేసీఆర్+బీజేపీ కుమ్మక్కు!.. కాంగ్రెస్ లాజిక్కు.. మీకు అర్థమవుతుందా!!

Congress: కేసీఆర్+బీజేపీ కుమ్మక్కు!.. కాంగ్రెస్ లాజిక్కు.. మీకు అర్థమవుతుందా!!
Advertisement

Congress: రాజకీయాలు బహు గమ్మత్తుగా ఉంటాయి. ఎవరు ఎవరికి మిత్రులో.. ఎవరు ఎవరికి శత్రువో ఓ పట్టాన అర్థం కాదు. శత్రువుకి శత్రువు మిత్రుడు..లాంటి డైలాగులు కూడా ఇక్కడ అప్లై అవవు. తెలంగాణలో అదే జరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ట్రయాంగిల్ పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ సందర్భంలో ప్రజలను కన్ఫ్యూజన్లో పడేసి.. ఆ కన్ఫ్యూజన్లో తాము మరింత లాభపడాలనేలా పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ఆ రాజకీయ క్రీడ రంజుగా సాగుతోంది.

“బీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలు.. వారిమధ్య రహస్య ఒప్పందం ఉంది.. కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే వారి ఉమ్మడి ఎజెండా”. ఇదీ కాంగ్రెస్ పార్టీ పదే పదే చేసే విమర్శ.

Advertisement

“బీఆర్ఎస్ కు కాంగ్రెస్ బీ టీమ్. ఆ రెండు పార్టీలు ఒక్కటే. భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయి”. ఇదీ బీజేపీ చేసే విమర్శ.

వీళ్లు వాళ్ల మీద.. వాళ్లు వీళ్ల మీద.. అబాంఢాలు వేసుకుంటూనే ఉంటాయి. అవి విన్న ప్రజలకు ఎవరు ఎవరితో మిలాఖత్ అయ్యారోననే డౌటనుమానం వెంటాడుతుంటుంది. క్లారిటీ మాత్రం రాదు. అంతా కన్ఫ్యూజనే.

Advertisement

లేటెస్ట్ గా ఆ కన్ఫ్యూజన్ పై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది తెలంగాణ కాంగ్రెస్. “మీకు అర్థమవుతుందా….తెలంగాణ ప్రజలారా? కేసీఆర్+బీజేపీ కుమ్మక్కు!” అంటూ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. అందులో ఏముందంటే…

ఇదీ మేటర్. రేవంత్ రెడ్డి ఊ అన్నా.. ఊఊ అన్నా.. పోలీసులు ఆయన ఇంటి ముందు వాలిపోతారు.. హౌజ్ అరెస్టులు చేస్తారు.. అదే బండి సంజయ్ జోలికి మాత్రం వెళ్లరు.. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు వెళ్లే వరకూ ఆపరు.. అంటూ లాజిక్ పాయింట్ లాగారు టి.కాంగ్ నేతలు. దీని అర్థం బీజేపీని కావాలనే హైప్ చేస్తున్నారనేది కాంగ్రెస్ వర్షన్. అందుకే, కేసీఆర్+బీజేపీ కుమ్మక్కు అయ్యారని.. తెలంగాణ ప్రజలారా? మీకు అర్థమవుతోందా? అంటూ సినిమా పంచ్ డైలాగ్ తో ట్వీట్ చేసింది తెలంగాణ కాంగ్రెస్.

Related News

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

Big Stories

Advertisement
×