BigTV English

Akkineni Nagarjuna: నాగార్జున వెనుక ఆ బడా నేత? టాలీవుడ్ పెద్దలంతా అప్పుడేమయ్యారు? సమ్‌థింగ్ ఫిషీ!

Akkineni Nagarjuna: నాగార్జున వెనుక ఆ బడా నేత? టాలీవుడ్ పెద్దలంతా అప్పుడేమయ్యారు? సమ్‌థింగ్ ఫిషీ!

Akkineni Nagarjuna: మంత్రి కొండా సురేఖపై నాగార్జున కేసు వేయడం వెనుక అసలేం జరిగింది? రాజకీయ నాయకుల కామెంట్స్‌ని లైట్‌గా తీసుకునే నాగ్, సడన్‌గా రియాక్ట్ కావడానికి కారణమెవరు? వెనుక నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? ఎవరైనా ఒత్తిడి చేశారా? నాగ్ విషయంలో గ్లామర్ ఇండస్ట్రీ ఓవర్‌గా రియాక్ట్ అయ్యిందా? పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ విషయంలో ఎందుకు స్పందన కరువైంది? అప్పుడు మౌనానికి అర్థమేంటి? ఈ మధ్యకాలంలో అతిగా స్పందిస్తున్న ఆ పెద్దాయన, అప్పుడెందుకు నోరెత్తలేదు? వీటిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ మొదలైపోయింది.


ప్రతిపక్షాల ట్రాప్‌లో సినీ పరిశ్రమ పడిందా? ప్రతి పక్షాల ట్రాప్‌లో టాలీవుడ్ పడొద్దని కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ ఎందుకన్నారు? నటుడు నాగార్జున వెనుకున్నది ఆ బడా నేతేనా? అందుకే టాలీవుడ్ నుంచి ఆ స్థాయిలో రియాక్షన్స్ వచ్చాయని అంటున్నారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు మీడియా ముఖంగా చెప్పారు. నాగార్జున ఫ్యామిలీని కించ‌ప‌రిచే ఉద్దేశం వెల్లడించారు.

అయినా సరే నాగార్జున న్యాయస్థానం ఎక్కడం వెనుక ఓ బడా నేత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఒత్తిడి కారణంగా మంత్రిపై కోర్టుకు వెళ్లినట్టు టాలీవుడ్‌లో చర్చ మొదలైపోయింది. నాగార్జున పిటిషన్ సోమవారానికి వాయిదా పడింది. సోమవారం నాగ్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది నాంపల్లి కోర్టు. ఆ నేతకున్న పరిచయాలతో ఇండస్ట్రీలో కొందరు ప్రముఖుల చేత ఈ విధంగా చేసినట్టు చెప్పుకొంటున్నారు. ఇంతవరకు స్టోరీ బాగానే నడిచింది.


ఇక అసలు విషయానికొద్దాం. నాగ్ వ్యవహారంపై టాలీవుడ్‌లో లుకలుకలు బయట పడుతున్నాయి. ఇండస్ట్రీ రెండుగా చీలిపోయిందా? అవుననే సంకేతాలు బలంగా వస్తున్నాయి. గతంలో పవన్ కల్యాణ్, రేణుదేశాయ్‌ని రోజా, పోసాని లాంటివాళ్లు ఓపెన్‌గా విమర్శించారు.

రోజా అయితే ఓ అడుగు ముందుకేసి రేణుపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో టాలీవుడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. సైలెంట్ అయిపోయారు. రోజా, పోసాని ఇండస్ట్రీ వాళ్లే కావడంతో మనలో మనం తిట్టుకోవచ్చని టాలీవుడ్ భావించిందని నెటిజన్స్ మాట.

ALSO READ: కేటీఆర్‌, హ‌రీష్‌రావులు బుక్కయ్యారు, పిలుపు ఎప్పుడు?

ఇండస్ట్రీ వాళ్లని అంటే ఊరుకునేది గొంతెత్తుతున్న కొంతమంది, అప్పుడెందుకు నోరు మెదపలేదు అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. పవన్ కో న్యాయం.. నాగార్జునకు మరో న్యాయమా? అప్పుడు పవన్ ఒంటరి చేసిన టాలీవుడ్, ఇప్పుడు పరిశ్రమను విశాఖకు తరలించాలని ప్లాన్ చేస్తోందట.

 

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×