E-Paper
Advertisement

IRCTC Ticket Transfer: మీ రైలు టికెట్‌ వేరొకరి పేరు మీదకు బదిలీ.. సింపుల్ ప్రాసెస్ ఇదే

IRCTC Ticket Transfer: మీ రైలు టికెట్‌ వేరొకరి పేరు మీదకు బదిలీ.. సింపుల్ ప్రాసెస్ ఇదే
Advertisement

IRCTC Ticket Transfer: మీ స్నేహితుడి ఇంట్లో వేడుకకు వెళ్దామని ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ఇంతలో అర్జెంట్ వర్క్ మీద వేరొక చోటికి వెళ్లాల్సి వచ్చింది. మీ కుటుంబ సభ్యుడిని పంపాలనుకున్నారు. అయితే మీరు బుక్ చేసుకున్న టికెట్ ను క్యాన్సిల్ చేసుకోవలసిన పని లేదు. ఆ టికెట్ మీద మీ కుటుంబ సభ్యులు ప్రయాణించవచ్చు. రైల్వే రూల్స్ ప్రకారం మీ ట్రైన్ టికెట్ ను కుటుంబ సభ్యుల పేరుపై ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. రిజర్వ్ చేసుకున్న టికెట్‌లో పేరు మార్చుకోవాలంటే.. మీరు బుక్ చేసుకున్న టికెట్ ప్రింటవుట్, ఫొటో ఐడెంటిటీ కార్డుతో.. ట్రైన్ బయలుదేరే కనీసం 24 గంటల ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లో సంప్రదించాలి. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ కు రిజర్వ్ చేసిన టికెట్‌లో పేరు మార్చడానికి అధికారం ఉంటుంది.

24 గంటల ముందు

కుటుంబ సభ్యుల పేరు మీదకు ట్రైన్ టికెట్ ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటే.. టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి ట్రైన్ షెడ్యూల్ కు 24 గంటల ముందు రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేయాలి. ఇలా చేస్తే తన టికెట్ ను కుటుంబంలోని మరొకరి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె, భర్త లేదా భార్య… ఇలా మీ కుటుంబ సభ్యుల పేరిట టికెట్ ను ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు అవకాశం ఉంది.

రిక్వెస్ట్ లెటర్ రాసి

Advertisement

అలాగే ప్రభుత్వ అధికారులు.. అధికారిక ప్రయాణాల్లో కూడా టికెట్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. సంబంధిత అధికారి తన ప్రయాణానికి 24 గంటల ముందు పేరు మార్పు కోసం రాత పూర్వకంగా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. గ్రూప్ ప్రయాణాలు అంటే విద్యార్థులు, సంస్థల్లోని ఉద్యోగులు.. పేర్లు మార్పు కోసం సంబంధిత నిర్వాహకులు.. ప్రయాణ షెడ్యూల్ కు 48 గంటల ముందు రాతపూర్వకంగా రిక్వెస్ట్ చేసి పేర్లు మార్చుకోవచ్చు. అయితే అదే విద్యాసంస్థ లేదా కంపెనీలోని ఇతరుల పేరిట మాత్రమే టికెట్ బదిలీ అవుతుంది.

Also Read:  టూరిస్టులకు IRCTC క్రేజీ ఆఫర్, ఆ రైల్లో ఏకంగా 20 శాతం డిస్కౌంట్!

పెళ్లి బృందాలు కూడా

Advertisement

పెళ్లి బృందాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వాళ్లు.. ఆ బృందాన్ని లీడ్ చేసే వ్యక్తి.. ప్రయాణానికి 48 గంటల ముందు గ్రూపులోని ఒక సభ్యుడి పేరిట బుక్ అయిన టికెట్ ను మరొకరి పేరిట మార్చుకోవచ్చు. అందుకు రాతపూర్వకంగా లెటర్ సబ్‌మిట్ చేయాలి. ఎన్సీసీ క్యాడెట్ల గ్రూప్ అయితే.. ఆ గ్రూప్ లీడర్ 24 గంటల ముందు టికెట్ బదిలీకి రిక్వెస్ట్ చేయవచ్చు. ఇలా పేరు మార్చుకోవడానికి కేవలం ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. అలాగే గ్రూప్ బుకింగ్‌ల విషయంలో, మొత్తం గ్రూప్ లో 10% మించి ట్రాన్స్ ఫర్ కు అనుమతించరు. రాయితీపై బుక్ చేసుకున్న టికెట్లకు ట్రాన్స్ ఫర్ అవకాశం లేదు.

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×