E-Paper
Advertisement

రోడ్లపై లైన్లకు అర్థం ఏంటి?.. తెలుపు గీతలను ఎందుకు గీస్తారు?

రోడ్లపై లైన్లకు అర్థం ఏంటి?.. తెలుపు గీతలను ఎందుకు గీస్తారు?
Advertisement

Road Lines In India: రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మీరు గమనించే ఉంటారు.. రోడ్డు మధ్యలో తెల్లటి గీతలు కంటిన్యూగా లేదా ముక్క ముక్కలుగా ఉంటాయి. అసలు వీటి అర్ధం ఏంటి, వీటిని ఎందుకు గీస్తారో తెలుసుకుందాం.

1. బ్రోకెన్ లైన్స్ – మల్టీ లేన్‌ రోడ్లపై.. లేన్‌లను సూచించడానికి లేదా రెండు వైపులా రాకపోకలు సాగించేలా రోడ్డులో మధ్యలో వైట్ బ్రోకెన్ లైన్స్ గీస్తారు. రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు ఎలాంటి వాహనాలు ఎదురుగా రాని పక్షంలో సురక్షితంగా ఉన్నట్లయితే, వాహనదారులు పక్క లేన్‌లోకి వెళ్లి ఓవర్‌టేక్ చేయవచ్చు.

Advertisement

2. లాంగ్ బ్రోకెన్ లైన్స్ – నార్మల్ బ్రోకెన్ లైన్స్ మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే.. ఈ లైన్స్ ఉన్న చోట ట్రాఫిక్ మార్పునకు హెచ్చరికగా వాడతారు.

Advertisement

3. సాలిడ్ లైన్ – ఇందులో ఎలాంటి గ్యాప్స్ లేకుండా పూర్తి సాలిడ్ లైన్ ఉంటుంది. ఈ లైన్స్ ఓవర్‌టేకింగ్, పాసింగ్ లేదా కటింగ్ కు అనుమతి లేదని సూచిస్తాయి. వీటిని సాధారణంగా మలుపుల వద్ద లేదా ఎక్కువ ట్రాఫిక్ ఉండే జంక్షన్ల వద్ద ఏర్పాటు చేస్తారు.

4. డబుల్ సాలిడ్ లైన్ – ఇది సాలిడ్ లైన్ మాదిరిగా ఓవర్ టేకింగ్, పాసింగ్, కటింగ్ అనుమతిలేదని తెలియజేస్తుంది. చాలా స్ట్రిక్ట్ గా ఈ రూల్ ఫాలో అవ్వాలని డబుల్ సాలిడ్ లైన్ తెలియజేస్తుంది.

5. బ్రోకెన్ అండ్ సాలిడ్ లైన్ – ఒక వైపు బ్రోకెన్ లైన్ , మరోవైపు సాలిడ్ లైన్ ఉంటే.. సురక్షితంగా ఉన్నప్పుడు ఓవర్‌టేక్ చేయవచ్చు. అలాగే ఎదురుగా వస్తున్న వాహనాలకు ఓవర్‌టేక్ చేయడానికి అనుమతి లేదు. మీరు ప్రయాణిస్తున్న లేన్‌ లో సాలిడ్ లైన్ ఉంటే ఓవర్ టేక్ కు అనుమతి లేదని అర్థం.

6. బ్రోకెన్ లైన్ పై బాణం గుర్తు – బాణం గుర్తు సూచించిన లేన్‌లోకి త్వరగా టర్న్ అవ్వాలని వాహనదారులకు సూచిస్తుంది. రాబోయే మలుపు లేదా జంక్షన్ రోడ్డు గురించి వాహనదారులకు తెలియజేయడానికి ఈ గుర్తు వాడతారు.

7. స్ట్రిప్డ్ మీడియన్ – ఇది రెండు సాలిడ్ లైన్ల మాదిరిగా ఉంటుంది. వీటి మధ్యలోని గ్యాప్ లోకి ప్రవేశించకూడదని అర్ధం. వివిధ సందర్భాల్లో ఈ లైన్స్ వాడతారు.

రెండు రోడ్లను వేరే చేసే ఫిజికల్ మీడియన్ సమీపంలో ఉందని తెలియజేయడానికి
రహదారి తగినంత వెడల్పుగా లేని ప్రాంతం సమీపిస్తుందని తెలుపుతుంది.
భారీ టర్నింగ్ ఉండడంతో.. ఎదురెదురుగా ఉన్న రెండు లేన్‌ల మధ్య దూరాన్ని మరింత పెంచడానికి దీనిని వాడతారు.
ప్రధాన రహదారి సమీపంలో బై రోడ్ ఉంటే.. వాహనాల స్పీడ్ తగ్గించాల్సిన ఉందని తెలియజేయడానికి, వాహనాలు బై రోడ్ లోకి టర్న్ అయ్యే చోట ఈ లైన్స్ వాడారు.

8. జిగ్‌జాగ్ లైన్స్ – వాహనదారులు స్పీడ్ తగ్గించాలని, పాదచారులను గమనించాలని ఈ గీతలు సూచిస్తాయి. జీబ్రా క్రాసింగ్‌ల దగ్గర లేదా పాదచారుల ఎక్కువగా క్రాస్ చేసే చోట్ల వీటిని ఉపయోగిస్తారు.

9. సైడ్ సాలిడ్ లైన్స్ – వీటిని రోడ్డుకు ఇరువైపులా ఉండే బోర్డర్స్ ను గుర్తించడానికి ఉపయోగిస్తారు. వాహనాలు ఈ బోర్డర్ గీతలను దాటి వెళ్లకూడదు. ఈ గీతలు తెలుపు రంగులో ఉంటే, వాటిని పాదచారులు నడవడానికి, వాహనాలు తాత్కాలికంగా పార్క్ చేయడానికి ఉపయోగించవచ్చు. కానీ ఈ సాలిడ్ లైన్లు పసుపు రంగులో ఉంటే, అక్కడ పార్కింగ్ చేయకూడని సూచిస్తుంది.

10. నిచ్చెన ఆకారపు లేన్ మార్కింగ్ – ఈ మార్కింగ్‌లు ఫుట్‌పాత్‌ల వంటివి. ఫుట్‌పాత్‌లకు వర్తించే అన్ని రూల్స్ ఈ మార్కింగ్‌కు వర్తిస్తాయి.

Also Read: 2028 నాటికి రాష్ట్రంలో కల్లు చెదిరేలా అద్భుతమైన రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి!

Related News

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

రాత్రిపూట వెలిగే మొక్కలు వచ్చేశాయి.. ‘అవతార్‘ సినిమాలో చూసింది ఇప్పుడు నిజమైంది!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

స్మశానంలో ప్రేమాయణం.. ఇదేం పిచ్చిరా అయ్యా!

Big Stories

Advertisement
×