E-Paper
Advertisement

Kiran kanth: తండ్రైన బ్రహ్మముడి సీరియల్ నటుడు కళ్యాణ్.. పాప పేరు ఏంటో తెలుసా?

Kiran kanth: తండ్రైన బ్రహ్మముడి సీరియల్ నటుడు కళ్యాణ్.. పాప పేరు ఏంటో తెలుసా?
Advertisement

Kiran kanth:  కిరణ్ కాంత్ అంటే టక్కున ఎవరికి గుర్తు రాకపోవచ్చు కానీ బ్రహ్మముడి సీరియల్ కవి అంటే మాత్రం అందరికీ టక్కున కిరణ్ కాంత్ (Kiran kanth)గుర్తుకొస్తారు. స్టార్ మాలో ప్రసారం అవుతన్న బ్రహ్మముడి సీరియల్(Brahmamudi serial ) లో కళ్యాణ్ పాత్రలో నటిస్తున్న కిరణ్ కాంత్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈయన కేవలం స్టార్ మా లో మాత్రమే కాకుండా ఇతర బుల్లితెర చానల్స్ లో కూడా పలు సీరియల్స్ చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా కిరణ్ కాంత్ ప్రేరణ (Prerana)దంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. కిరణ్ కాంత్ గత డిసెంబర్ నెలలో తన భార్య ప్రేరణ సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

శన్విత కిరణ్..

ఇకపోతే తాజాగా ప్రేరణ పండంటి ఆడబిడ్డకు (Baby Giral)జన్మనిచ్చిన విషయాన్ని ఈ దంపతులు అధికారికంగా తెలియజేశారు. ఇక ఈ చిన్నారి జనవరి 10వ తేదీ జన్మించినప్పటికీ ఆలస్యంగా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు. పాప జన్మించి 21 రోజు పూర్తి కావడంతో బారసాల వేడుకను కూడా నిర్వహించారని తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను కిరణ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమకు పాప పుట్టింది అని తనకు శన్విత కిరణ్(Shanvitha Kiran) అని నామకరణం చేసినట్లు తెలియజేశారు. లక్ష్మీదేవికి ప్రతిరూపమైన పేరును తన కుమార్తెకు పెట్టినట్టు ఈ దంపతులు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు అయితే చిన్నారి శన్విత ఎలా ఉంటుందనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

తల్లిదండ్రులైన కిరణ్ కాంత్ దంపతులు..

Advertisement

ఈ విధంగా కిరణ్ కాంత్ ప్రేరణ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారనే విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే పాప జన్మించిన 21 రోజుల వరకు ఈ విషయాన్ని తెలియ చేయకపోవడం గమనార్హం. పాప పేరును రివిల్ చేయడంతో పేరు చాలా క్యూట్ గా ఉంది. మరి పాప ఎలా ఉంది ఎప్పుడు చూపిస్తారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక కిరణ్ కాంత్ విషయానికి వస్తే ఈయన స్టార్ మాలో బ్రహ్మముడి సీరియల్ మాత్రమే కాకుండా ఇదివరకు గుప్పెడంత మనసు సీరియల్ లో కూడా గౌతమ్ అనే పాత్రలో నటించారు.

Advertisement

ఈ సీరియల్  రిషి ఫ్రెండ్ పాత్రలో కనిపించిన గౌతమ్ ఈ సీరియల్ ద్వారా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ అనంతరం బ్రహ్మముడి సీరియల్ లో కూడా కళ్యాణ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్లో కూడా ఈయన ప్రధాన పాత్రలో కాకపోయినా హీరో తమ్ముడి పాత్రలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కిరణ్ కాంత్ ప్రస్తుతం బుల్లితెర నటుడిగా కొనసాగుతూ కెరియర్ ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Spirit Movie: స్పిరిట్ సినిమాలో విజయ్ దేవరకొండ.. కన్ఫర్మ్ చేసిన సందీప్ రెడ్డి?

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×