BigTV English
Advertisement

 Brahmamudi Serial Today October 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను తికమక పెట్టిన కనకం – కనకం మాటలకు షాకైన అత్తాకోడళ్లు

 Brahmamudi Serial Today October 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను తికమక పెట్టిన కనకం – కనకం మాటలకు షాకైన అత్తాకోడళ్లు

Brahmamudi serial today Episode:  రాజ్, కావ్యలను కలిపేందుకు గుడిలో కనకాన్ని కలుస్తారు అపర్ణ, ఇందిరాదేవి. ముగ్గురు కలిసి ఏదైనా ప్లాన్‌ చేయాలని ఆలోచిస్తారు. ఎలాగైనా  వాళ్లను కలపాలని అందుకోసం మనమే చొరవ తీసుకోవాలని అనుకుంటారు. ఇంతలో కనకం వాళ్లిద్దరిని త్వరగా కలపాలని లేకపోతే ఇక ఈ జన్మకు నేను వాళ్లు కలవడం చూడలేనని బాధపడుతుంది. దీంత ఇందిరాదేవి ఎందుకంత నిరాశ కనకం అంటూ అడగ్గానే నేను ఇక మూడు, నాలుగు నెలల కంటే ఎక్కువ బతకనని ముక్కులోంచి రక్తం వస్తేంటే టెస్ట్‌ చేయించానని. అక్కడ డాక్టర్లు తనకు క్యాన్సర్‌ ఉందని త్వరలోనే చనిపోతానని చెప్పారు అనడంతో అపర్ణ, ఇందిరాదేవి షాక్‌ అవుతారు.


కనకాన్ని  ఎలా ఓదార్చాలో తెలియకు అయోమయంగా చూస్తుండిపోతారు. ఇంతలో కనకం గట్టిగా నవ్వుతూ నమ్మేశారు కదా అంటూ మీరే నమ్మేశారు అంటే ఇక అల్లుడుగారు కచ్చితంగా నమ్ముతారు అంటుంది. దీంతో కనకాన్ని తిడతారు అపర్ణ, ఇందిరాదేవి. అయితే నాటకం ఆడిన మంచి ఐడియా ఇచ్చావని ఇప్పటి నుంచే నాటకం మొదలు పెడదామని డిసైడ్‌ అవుతారు. అయితే రేపు మా పెళ్లి రోజని అది అడ్డుపెట్టుకుని వాళ్లిద్దరిని కలిపే ప్రయత్నం మొదలెపెడదామని చెప్తుంది కనకం. సరే అంటారు అపర్ణ, ఇందిరాదేవి.

ఇంట్లో బొమ్మలకు రంగులు వేసుకుంటూ కూర్చున్న మూర్తి దగ్గరకు కావ్య వెళ్తుంది. రేపు మీ 25వ పెళ్లిరోజు నాన్నా అని గుర్తు చేస్తూ నేను మీ పెళ్లి రోజును సెలబ్రేట్‌ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. మూర్తి మాత్రం వద్దులే కావ్య అంటాడు. ఇంతలో అక్కడకు కనకం వస్తుంది. స్వప్న కూడా మా పెళ్లి రోజు జరిపించాలని ఆశపడుతుంది అని చెప్తుంది. దీంతో కావ్య అక్కను నువ్వెక్కడ కలిశావని అడుగుతుంది కావ్య. ఆ ఇంటికి వెళ్లావా? అంటూ నిలదీస్తుంది.


కనకం కోపంగా  ఏంటే ఆ ఇంటికి వెళ్లావు అని అడుగుతున్నావు. నాకేం పని పాటా లేదనుకున్నావా? ఇందాక స్వప్న గుడికి వచ్చింది. అక్కడే చెప్పింది. అయినా వాళ్లు జరిపిస్తామని చెప్తే నువ్వెందుకు అడ్డుపడుతావే అంటుంది కనకం. వాళ్లా వాళ్లెవరు అంటూ కావ్య అడగడంతో వాళ్లంటే స్వప్న వాళ్లు అయినా గొడవలు సద్దుమణగడానికి ఇదొక అవకాశం అంతేకానీ నువ్వు అడ్డుపడితే బాగోదు అటుంది కనకం. దీంతో నీ ఇష్టం అంటూ కావ్య వెళ్లిపోతుంది. మూర్తి, కనకాన్ని తిడతాడు. స్వప్న జరిపిస్తానంటే నువ్వెలా ఒప్పుకున్నావు అంటాడు. స్వప్న అంత తెలివితేటలు ఎక్కడున్నాయండి. అంటూ కావ్య, రాజ్‌ లను కలిపేందుకు ముగ్గురు కలిసి గుడిలో ప్లాన్‌ చేసిన విషయం చెప్తుంది కనకం.

గుడి నుంచి ఇంటికి వచ్చిన అపర్ణ, ఇందిరాదేవి. హాల్లో రాజ్‌ కూర్చుని ఉండటం చూసి డల్లుగా లోపలికి వస్తారు. నీకీ విషయం తెలుసా? నాన్నా అంటూ రాజ్‌ను అపర్ణ అడగ్గానే ఏ విషయం మమ్మీ అంటాడు రాజ్‌. అబ్బో నా నోటి నుంచి నేనా విషయం చెప్పలేను అత్తయ్యా మీరు చెప్పండి అంటుంది అపర్ణ. దీంతో ఇందిరాదేవి కూడా నేను చెప్పలేనని అంటుంది. ఇద్దరు నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు అనుకుంటారు.

ఇంతలో రాజ్‌ ఎవరో ఒకరు చెప్పండి అనగానే  అపర్ణ మన కావ్య అనగానే మమ్మీ అసలు ఆ పేరే మన ఇంట్లో వినిపించొద్దు అంటే మీకు అర్థం కాదా? అంటూ కోపంగా బయటకు వెళ్లిపోతాడు. ఇంతలో అపర్ణకు కనకం ఫోన్‌ చేసి ఇక్కడ కావ్యను ఒప్పించాను. మీరు అక్కడ సక్సెస్‌ అయ్యారా? అని అడుగుతుంది. దీతో లేదని ఇక్కడ డిజాస్టర్‌ అయిందని చెప్తారు. అయితే నన్ను రంగంలోకి దిగమంటారా? వదిన అని కనకం అడుగుతుంది. అపర్ణ కనకాన్ని తిడుతుంది. మేము ఏంటో చూపిస్తాము అంటుంది.

రాజ్‌కు డైరెక్టుగా చెబితే వినడని మనకు ఒక మీడియేటర్‌ కావాలని అనుకుంటారు. ఇంతలో ప్రకాష్‌ అక్కడకు రాగానే విషయం చెప్పి ప్రకాష్‌ను రాజ్‌ దగ్గరకు పంపిస్తారు. కంగారుగా రాజ్ దగ్గరకు పరుగెత్తుకెళ్లిన ప్రకాష్‌. రాజ్‌ నీకీ విషయం తెలుసా? అంటూ ఇంత చిన్న వయసులో కావ్యకు రాకూడని కష్టం వచ్చిందిరా అంటాడు. దీంతో రాజ్ ఏమైందని అడిగితే ప్రకాష్‌ ఏదో చెప్పబోయి మర్చిపోయానురా? కావాలంటే మా అమ్మను అడుగు మొత్తం తెలుసు అంటాడు.

సరేనని రాజ్‌  లోపలికి వెళ్తూ అంతకుముందు అపర్ణ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. లోపల తమ నాటకాన్ని రక్తి కట్టిస్తారు అత్తాకోడళ్లు. దీంతో రాజ్‌ కన్పీజ్‌గా మళ్లీ బయట ఉన్న ప్రకాష్‌ దగ్గరకు వచ్చి ఏమైందని అడిగితే తన మతిమరుపుతో పిచ్చ కామెడీ చేస్తాడు ప్రకాష్‌. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Tags

Related News

Actress Pawan Sai : పవన్ సాయి కాపురంలో చిచ్చు పెట్టింది ఆమెనే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Intinti Ramayanam Today Episode: పల్లవికి చక్రధర్ సర్ప్రైజ్.. అవనికి నిజం చెప్పిన మీనాక్షి.. పల్లవికి షాక్..

GudiGantalu Today episode: షీలా పుట్టినరోజు వేడుకకు బాలు దూరం.. ప్రభావతి హ్యాపీ.. బాధపడిన సత్యం..

Nindu Noorella Saavasam Serial Today November 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని  చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న రామ్మూర్తి

Serial Actress : సీరియల్ హీరో నిరంజన్ జీవితంలో ఊహించని ట్విస్టులు.. ఒంటరి జీవితం..

Illu Illalu Pillalu Today Episode: వేదవతి మాటతో మనసు మార్చుకున్న నర్మద.. పుట్టింటికి వెళ్ళిపోయిన ప్రేమ..

Serial Heroine : సీక్రెట్ గా పెళ్లి.. ఏడాదికే విడాకులు..ఇప్పుడు ఏం చేస్తుంది..?

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Big Stories

×